Sun Apr 28 2024 04:22:36 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు, రేపు మంగళగిరిలోనే పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు, రేపు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు, రేపు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటారు. నిన్న గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ కు అభిమానులు స్వాగతం పలికారు. ఈరోజు, రేపు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలతో చర్చించనున్నారు.
రేపు ఎన్నికల కమిషన్ ను...
దీంతో పాటు రేపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలసి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఆయన ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేయనున్నారు. ఉన్న ఓట్లను తొలగించడం లేని ఓట్లను చేర్చడం వంటి వాటిపై ఉదాహరణలతో సహా చంద్రబాబు, పవన్ ఎన్నికల కమిషన్ అధికారులకు ఇవ్వనున్నారు.
Next Story