Wed Apr 02 2025 11:52:55 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడిపై భజనలను పాడలేదు
శ్రీరాముడి భజనను భారత ప్రధాని నరేంద్ర మోదీ పాడారనే వాదనతో ఓ భజనతో కూడిన వీడియో వైరల్ అవుతోంది.

శ్రీరాముడి భజనను భారత ప్రధాని నరేంద్ర మోదీ పాడారనే వాదనతో ఓ భజనతో కూడిన వీడియో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో “ఈ రామ భజన్ ను ఎవరు పాడుతున్నారో ఊహించండి?? అది మరెవరో కాదు మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ జీ. దేశ సంస్కృతిని గురించి తెలుసుకున్న ప్రధాన మంత్రి ఉన్న దేశం ధన్యమైంది. ఇది చాలా గర్వించదగిన విషయమని పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ వాదనతో 2022 లో కూడా పోస్టులు వైరల్ అయ్యాయి.వైరల్ వీడియోలో భజనను పాడింది భారత ప్రధాని మోదీ అన్న వాదన అవాస్తవం. ప్రేమభూషణ్జీ మహారాజ్ ఈ భజనను పాడారు.భజనను వింటున్నప్పుడు “నర్ షరీర్ అన్మోల్ రే ప్రాణి” అనే పదాలు కనిపించాయి. ఈ కీలక పదాలను ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఈ భజనకు సంబంధించిన అనేక YouTube వీడియోలను మేము కనుగొన్నాము.వైరల్ వీడియో మాదిరిగానే విజువల్స్‌తో కూడిన ఈ వీడియోలలో ఒకటి కనుగొనబడింది. ఈ వీడియోలో పాట పాడిన కళాకారుడి పేరు లేకపోయినప్పటికీ, ఈ వీడియో కింద ఉన్న కామెంట్లలో ప్రేంభూషణ్జీ మహారాజ్ భజన పాడారని పేర్కొన్నారు.
Claim : Modi sang Bhajan heard in the viral video
Claimed By : Twitter Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Twitter
Fact Check : False
Next Story