Sun Dec 14 2025 06:02:05 GMT+0000 (Coordinated Universal Time)
10 భాషల్లో సూర్య 42వ చిత్రం.. 16న టైటిల్ అనౌన్స్ మెంట్
#SURIYA42 కథాకథనాలు విభిన్నంగా ఉండనున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 16వ తేదీ..

కోలీవుడ్ లో కొత్త కొత్త కథలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు చేసే హీరోల్లో సూర్య ముందుంటారు. ఇప్పటి వరకూ సూర్య చేసిన సినిమాల్లో చాలా వరకూ ప్రయోగాత్మక చిత్రాలే ఉంటాయి. తాజాగా ఆయన 42వ సినిమా పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. ఏ పాన్ ఇండియా సినిమా అయినా 5-6 భాషల్లో తెరకెక్కుతుంది. కానీ.. సూర్య 42వ సినిమా ఏకంగా 10 భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
#SURIYA42 కథాకథనాలు విభిన్నంగా ఉండనున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 9.05 నిమిషాలకు టైటిల్ ను ప్రకటించనున్నట్లు పేర్కొంటూ.. ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూడటానికి అడవీ ప్రాంతంలో విల్లంబులు ధరించి గుర్రాలపై వేటాడే ఒక వేటగాడు, ఆ గుర్రంపై ఒక కొండ కొస నుంచి మరో కొండపైకి జంప్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. పక్కనే ఆ గుర్రాన్ని అనుసరిస్తూ వేటకుక్క కూడా కనిపిస్తోంది. ఈ సినిమాలో సౌత్ లేడా సూపర్ స్టార్ నయనతార,బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా.. గజిని తర్వాత సూర్య-నయనతార కలిసి చేస్తున్న చిత్రం కావడంతో.. దీనిపై అభిమానులకు అంచనాలు ఉన్నాయి.
Next Story

