Mon May 06 2024 08:08:01 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. యాదాద్రి ఆలయం పునః ప్రారంభం అయిన తర్వాత తొలిసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
11 రోజుల పాటు...
మాడవీధులు, విష్ణు పుష్కరిణి, సప్తరాజ గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పదకొండు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. విష్వక్సేన ఆరాధనతో ఆదిపూజలు మొదలవుతాయని పండితులు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
Next Story