Fri Dec 20 2024 12:37:45 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : 2023లో కొత్త దర్శకులు సంచలనాలు..
ఈ ఏడాది టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయలేదు. కానీ కొత్త దర్శకులు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద..
2023 Rewind : ఈ ఏడాదిలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నుంచి, టాప్ హీరోల నుంచి పెద్ద సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయలేదు. అయితే కొత్త దర్శకులు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు. మరి ఆ దర్శకులు ఎవరు..? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటి..? బాక్స్ ఆఫీస్ వద్ద అవి సృష్టించిన సంచనాలు ఏంటి..?
రైటర్ పద్మభూషణం..
కలర్ ఫోటో మూవీతో హీరోగా పరిచయం అయిన సుహాస్.. తన రెండో సినిమాని కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తో ‘రైటర్ పద్మభూషణం’ చేశారు. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం నాలుగు కోట్ల బొడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద 12 కోట్లు కొల్లగొట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకుంది.
వినరో భాగ్యము విష్ణుకథ..
కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర డైరెక్ట్ చేసిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’.. సుమారు ఆరు కోట్లతో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద 12 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని మంచి విజయానే అందుకుంది.
బలగం..
జబర్దస్త్ షోలో తన కామెడీతో అందర్నీ నవ్వించిన వేణు.. దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి హీరోగా రూపొందిన ఈ చిత్రం కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి దాదాపు 26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. అంతేకాదు పలు ఇంటర్నేషనల్ అవార్డులను కూడా గెలుచుకుంది.
హాయ్ నాన్న దసరా..
కొత్త దర్శకులకు వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్తున్న హీరో నాని.. ఈ ఏడాది ఇద్దరి దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ‘దసరా’తో శ్రీకాంత్ ఓదెల, 'హాయ్ నాన్న'తో శౌరవ్ ని పరిచయం చేశారు. దసరా 117 కోట్ల కలెక్షన్ అందుకొని నాని వంద కోట్ల క్లబ్ లోకి తీసుకు వచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన హాయ్ నాన్న ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించేసింది. 50 కోట్ల మార్క్ ని దాటేసిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా పరుగులు పెడుతుంది.
మేమ్ ఫేమస్..
షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ ని సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్.. హీరోగా, దర్శకుడిగా చేస్తూ వెండితెర అరంగేట్రం చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’. మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏడు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
బెదురులంక 2012..
RX100 తరువాత మళ్ళీ మంచి విజయం అందుకొని కార్తికేయ.. ఈ ఏడాది బెదురులంక 2012 తో సూపర్ హిట్టుని అందుకున్నారు. కొత్త దర్శకుడు క్లాక్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. సుమారు ఏడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 16 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
మ్యాడ్..
కొత్త నటీనటులను, కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ ని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తెరకెక్కించిన సినిమా ‘మ్యాడ్’. కాలేజీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 24 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Next Story