Sun Dec 22 2024 21:56:14 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కూటమి ఎంపీ అభ్యర్థులు లీడ్ లో.. పిఠాపురంలో పవన్ దే ఆధిక్యత
ఆంధ్రప్రదేశ్ లో కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. పార్లమెంటు అభ్యర్థులు ఇద్దరు ఆధిక్యంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. పార్లమెంటు అభ్యర్థులు ఇద్దరు ఆధిక్యంలో ఉన్నారు. రాజమండ్రి అభ్యర్థి పురంద్రీశ్వరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే నరసారావుపేట అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇలా రెండు చోట్ల పార్లమెంటు అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు.
తొమ్మిది స్థానాల్లో...
ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తొమ్మిది స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, వైసీపీ ఇంత వరకూ ఎక్కడా ఆధిక్యంలో రాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లోనూ ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. పిఠాపురంలోనూ జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో ఆధిక్యంలో ఉన్నారు. పోలింగ్ శాతం టీడీపీ 56 శాతం కాగా, వైసీపీకి 41 శాతం ఓట్లు మాత్రమే ఎర్లీ ట్రెండ్స్ లో వచ్చాయి.
Next Story