Fri Dec 27 2024 12:47:06 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : జగన్ ఓపెన్ అయిపోయాడు.. అందరికీ ఇచ్చిపడేసినట్లే మాట్లాడాడే
తన కుటుంబంలో జరిగే పరిణామాలతో పాటు వివేకానంద హత్య, ఆయన రెండో వివాహం గురించి కూడా జగన్ ప్రస్తావించారు.
వైఎస్ జగన్ చాలా రోజుల తర్వాత ఓపెన్ అయ్యారు. తన కుటుంబంలో జరిగే పరిణామాలతో పాటు వివేకానంద హత్య, ఆయన రెండో వివాహం గురించి కూడా ప్రస్తావించారు. పులివెందులలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. తన చెల్లెళ్లు పసుపు చీర కట్టుకుని ప్రత్యర్థుల వద్దకు వెళ్లి మోకరిల్లుతున్నారని కూడా సిస్టర్స్ పై ఫైర్ అయ్యారు. వైఎస్ ఎవరిమీదనయితే సుదీర్ఘకాలం పోరాడారో వారితోనే చేతులు కలిపి తనపై యుద్ధానికి దిగారని జగన్ అన్నారు. ప్రత్యర్థులతో చేతులు కలపడమే కాదు.. కుటుంబంలో చిచ్చుపెట్టే వారు వైఎస్ వారసులు ఎలా అవుతారంటూ ప్రజలనే ఆయన ప్రశ్నించారు.
ఎఫ్ఐఆర్ లో చేర్చి...
వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీలోనే చేరి తనపైనే యుద్ధం ప్రకటించడం సబబేనా? అన్నారు. ప్రతిపక్షాల కుట్రలో నా చెల్లెళ్లిద్దరూ భాగస్వామ్యలవడం బాధ కలిగిస్తుందన్నారు. వైఎస్సార్ వారసత్వం ఎవరకి వస్తుందని ఆయన ప్రశ్నించారు. తనపైనా, తనకుటుంబ సభ్యుల చేతనే ఆరోపణలు చేయిస్తూ తనను దెబ్బ తీయాలని చూస్తున్న వారి చేతులో పావులుగా మారారని, వారిని ఇంతకంటే ఏం చేయగలమని ప్రశ్నించారు. తనకు అధకారం ఇచ్చింది తన కుటుంబ సభ్యులు ఆస్తులు సంపాదించుకోవడానికి కాదని, ప్రజలకు సేవచేయడానికేనని, సంపాదనకు అడ్డుపడ్డాననే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. పులివెందుల అంటే నమ్మకం..పులివెందుల ధైర్యం.. ఒక సక్సెస్ స్టోరీ అని ఆయన అన్నారు.
రెండో పెళ్లి గురించి...
వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్యచేశారో అందరికీ తెలుసునని అన్నారు. వివేకాను చంపిన వాళ్లతోనే చేతులు కలుపుతున్నారని అన్నారు. వివేకా చిన్నాన్నకు రెండో పెళ్లి అయిందని వాస్తవమని అన్నారు. ఆయనకు పిల్లలు కూడా ఉన్నారన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డిని రాజకీయంగా బలిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అవినాష్ అమాయకుడని, అందుకే తాను టిక్కెట్ ఇచ్చానని జగన్ తెలిపారు. వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో అందరికీ తెలుసునని అన్నారు. కానీ బురదచల్లేందుకు ఎవరు నా చెల్లెళ్లను పంపారో అందరికీ తెలుసునని అన్నారు. పసుపు మూకతో చెల్లెమ్మలు ఏమవుతున్నారంటే ఇంతకంటే దిగజారుడుతనం మరెక్కడా ఉండదని అన్నారు. వైఎస్సార్ వారసులమని మీముందుకు వస్తున్నారని, ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని జగన్ ప్రశ్నించారు. ప్రజలు కాదా? అని అన్నారు.
Next Story