Sat Dec 21 2024 11:03:00 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : ఈ జబర్దస్త్ బ్యాచ్ ఎందుకు జానీ.... కామెడీ పీసులు .. సామీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికల్లో కూడా సినీ వాసన పోలేదనిపిస్తుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికల్లో కూడా సినీ వాసన పోలేదనిపిస్తుంది. ఎందుకంటే ఆ మధ్య ఆయన విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను చూస్తేనే అర్థమవుతుంది. పాలిటిక్స్ అంటే నవ్వులు కాదు.. సీరియస్ నెస్ ఉండాలి. కానీ పవన్ కల్యాణ్ జబర్దస్త్, ఢీ వంటి బుల్లి తెరపై కనపించే వారందరినీ తీసుకొచ్చి స్టార్ క్యాంపెయినర్లుగా జనంలోకి వదిలారు. వాళ్లు ప్రచారంలో ఏమాత్రం పనికి వస్తారో తెలియదు కానీ.. అదే సమయంలో అంతే స్థాయిలో నష్టం కూడా చేస్తారని తెలుసుకోవాలంటున్న సొంత పార్టీ నేతలే.
బుల్లితెరపై ఫేమస్ అయినా...
జబర్దస్త్ లో ఫేమస్ అయిన హైపర్ ఆది.. గెటప్ శ్రీను లాంటి వాళ్లు ప్రచారానికి యువత వస్తారు. వాళ్లు వేసే పంచ్ లకు నవ్వుకుంటారు. అంతే తప్పించి వాళ్లు ఓటర్లను ఏ మాత్రం ప్రభావితం చేయలేరంటున్నారు. బుల్లి తెరపై పది నిమిషాలు స్కిట్ చేసినట్లు కాదు.. జనాన్ని జనసేన వైపు తిప్పుకోవడమంటే. ఎందుకంటే వాళ్లను చూసి నవ్వుకునే వాళ్లు ఎక్కువ కానీ.. వారి వల్ల ఇన్ఫ్లూయన్స్ అయ్యే వాళ్లు మాత్రం చాలా తక్కువ శాతం మంది ఉంటారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
గెటప్ లు వేసుకుని...
గెటప్ లు వేసుకుంటూ తిరిగే వాళ్లకు.. ఓట్లు వేయాలని అడిగితే వాళ్లను యువత తప్ప మరెవ్వరూ పట్టించుకోరు. యువత ఎటూ పవన్ కల్యాణ్ అంటే క్రేజీగానే ఉంటారు. కానీ వీళ్లు ప్రచారం చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని జనసేన అభ్యర్థులు కూడా అంటున్నారు. డ్యాన్స్ మాస్టర్ జానీ, టీవీ నటుడు సాగర్ వరకూ కొంత అభిమానులున్నారు. అదే సమయంలో మరో స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు వరకూ ఓకే. ఎందుకంటే అతను యువతకు ఒక ఇన్సిపిరేషన్.. కానీ హైపర్ ఆది.. గెటప్ శ్రీను యువతకు ఏమి ఇన్సిపిరేషన్ అంటూ పలువురు నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ స్టార్ క్యాంపెయిర్ల ఎంపిక నాగబాబు ఇన్ఫ్లూయెన్స్ తోనే చేసినట్లుంది కానీ.. పార్టీకి మాత్రం ఉపయోగపడేది ఏమాత్రం లేదన్నది గాజుగ్లాస్ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నాు.
Next Story