Thu Dec 19 2024 06:50:14 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : జనసేన ఫైనల్ లిస్ట్ ఇదే... పద్దెనిమిది అభ్యర్థుల ప్రకటన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. త్వరలో ప్రచారానికి వెళుతుండటంతో ఆయన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. పిఠాపురం నుంచి ఈ నెల 27వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో పద్దెనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఆయన ఖరారు చేశారు.
పొత్తులో భాగంగా...
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనుంది. రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుంది. కాకినాడ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. కాకినాడ నుంచి ఉదయ్ పేరును ఇప్పటికే ప్రకటించిన పవన్ కల్యాణ్ మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మాత్రం బాలశౌరి పేరును ప్రకటించాల్సి ఉంది.
అభ్యర్థులు వీరే...
01.పిఠాపురం - కొణిదెల పవన్ కళ్యాణ్
02.అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
03.రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
04.నెల్లిమర్ల - లోకం మాధవి
05.తెనాలి - నాదెండ్ల మనోహర్
06.కాకినాడ రూరల్ - పంతం నానాజీ
07.నిడదవోలు - కందుల దుర్గేష్
08.తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్
09.నరసాపురం - బొమ్మిడి నాయకర్
10.ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
11.భీమవరం - పులపర్తి రామాంజనేయులు
12.పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు
13.యలమంచిలి - విజయ్ కుమార్
14.విశాఖ సౌత్ - వంశీకృష్ణ యాదవ్
15.రాజోలు - వరప్రసాద్
16. తిరుపతి - ఆరణి శ్రీనివాసరావు
17. పి. గన్నవరం - గిడ్డి సత్యనారాయణ
18. పోలవరం - చిర్రి బాలరాజు
Next Story