Fri Dec 20 2024 06:07:50 GMT+0000 (Coordinated Universal Time)
TDP : గుంటూరు వెస్ట్‌లో కలివిడి లేని కూటమి.. ఇలా అయితే ఎలా గెలుస్తావ్ గల్లా మాధవి..?
గుంటూరు వెస్ట్‌లో బీజేపీ, జనసేన నాయకులు ఎవరికి వారుగానే ఉన్నారు. ఎవరూ కూడా కలివిడిగా ముందుకు సాగడంలేదు
కూటమి అంటేనే.. విడివిడిగా ఉన్న పార్టీలు కాసేపు సిద్ధాంత రాద్ధాంతాలను కూడా పక్కన పెట్టి.. రాజకీ యాల్లో ప్రత్యర్థులను ఓడించేందుకు.. ముందుకు రావడం. ఈ క్రమంలో ఆయా పార్టీలు ఉమ్మడి అజెండా లు నిర్దేశించుకుని.. ప్రజల్లోకి వెళ్లడం. తద్వారా అధికారంలోకి రావడం అనేది కూటమి పార్టీల ఉమ్మడి లక్ష్యం. ఈ క్రమంలోనే ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కలిసి.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.మొత్తంగా కూటమి ఏర్పడింది.. సీట్లు పంచుకున్నారు.. బాగానే ఉంది. కానీ, ఇక్కడ చిత్రం ఏంటంటే.. క్షేత్రస్థాయిలో ఓట్లు పంచుకుంటే తప్ప.. ఓట్లు బదిలీ అయితే తప్ప అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. లేదా.. ఆయా పార్టీల అభ్య ర్థులు గెలిచే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరి కూటమిలో కలివిడి తనంతో ముందుకు వెళ్లాలి.
ఎవరితో కలవకుండా..
ఈ రకంగా చూసుకుంటే.. ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. గుంటూరు వెస్ట్‌లో బీజేపీ, జనసేన నాయకులు ఎవరికి వారుగానే ఉన్నారు. ఎవరూ కూడా కలివిడిగా ముందుకు సాగడంలేదు. ఈ పరిణామం.. టీడీపీ నుంచి గుంటూరు వెస్ట్‌లో పోటీ చేస్తున్న గల్లా మాధవికి సెగ పెడుతోంది. నిజానికి ఆమే ఇక్కడ కూటమి నేతలను కలుపుకొని పోవాలి. కానీ, ఎక్కడో తేడా కొట్టి.. ఆమె తన ప్రచారం తాను చేసుకుంటూ పోతున్నారు. విషయం ఏంటంటే.. ఇక్కడ బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు.. ఎన్నికలకు ముందు బాగా శ్రమించారు. చాలానే ఖర్చు పెట్టుకున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు కూడా బాగానే ఖర్చు చేశారు. కానీ, వీరిలో ఎవరికీ టికెట్ రాలేదు. పైగా.. తమకు కనీసం ఒక్క మాట కూడా.. చెప్పకుండానే మాధవికి టికెట్ కేటాయించారు.
పొత్తులో భాగంగా...
పొత్తులో భాగంగా జనసేన ఇక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే సీటు అవుతుందన్న ఆశలు పెట్టుకుంది. అయితే ఉమ్మడి జిల్లా మొత్తం మీద జనసేనకు ఒక్క తెనాలి సీటుతో సరిపెట్టడం ఆ పార్టీ వర్గాలకే నచ్చడం లేదు. ఈ తరహా ఆవేదన, ఆందోళన వంటివి.. టీడీపీ నుంచి జనసేన, బీజేపీ వరకు అందరికీ ఉంది. ఈ విషయంలో అగ్రనేతలు జోక్యం చేసుకుని వారిని మచ్చిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఆదిశగా ఇప్పటి వరకు చర్చలులేవు.. చర్యలు కూడా లేవు. దీంతో సీనియర్ నాయకుల్లోనే అసహనం ఏర్పడి.. కలివిడి లేకపోగా.. అంతర్గతంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆమె ఎవరినీ దగ్గరకు రానివ్వరని, ఇప్పుడే ఇలా ఉంటే గెలిచిన తర్వాత మన మాట వింటారా? అన్న డౌట్ కూడా టీడీపీ, జనసేన నేతల్లో వ్యక్తమతుంది.
మద్దతిచ్చేందుకు ముందుకు...
అంటే.. ఈ కూటమికి కాకుండా.. వైసీపీకి ఓటేయించే దిశగా కూడా.. నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఒక్క పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటుకు టీడీపీ క్యాండెట్ కాకుండా ఉండి ఉంటే వెస్ట్‌లో ఎన్నికలకు ముందే మాధవి చేతులెత్తేసిన పరిస్థితి ఉండేది. మాధవి కూడా పెద్దగా డబ్బులు తీయడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను పట్టించుకోవడం లేదు. గెలుపు ధీమాతో ఒకింత ధీమాతో ఆమె ఎవరినీ దగ్గరకు చేరనివ్వడం లేదు. మాధవి భర్త పెత్తనంతో మద్దతివ్వాలనుకున్న నేతలు కూడా చల్లగా జారుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇది టీడీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తుది. మరి ఫైనల్‌గా పోల్ మేనేజ్మెంట్లో ఇక్కడ ఏం జరుగుతుందో ? చూడాలి.
Next Story