Sun Dec 22 2024 19:52:51 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : చిరంజీవి మెసెజ్ మామూలుగా లేదుగా... ఇక లాభం లేదనుకుని ఎంట్రీ ఇచ్చేశారా?
మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఓపెన్ అయిపోయారు. తన అభిమానులకు ఆయన మెసేజ్ పాస్ చేసేశారు
మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఓపెన్ అయిపోయారు. తన అభిమానులకు ఆయన పరోక్షంగా కాదు.. ప్రత్యక్షంగానే పిలుపు ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పారు. దీంతో ఇప్పుడు ఏపీ రాజీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఏపీ రాజకీయాలు అంటేనే ఎప్పడూ హాట్ హాట్ గా ఉంటాయి. అలాంటిది చిరంజీవి ఇచ్చిన పిలుపుతో కొంత ఫ్యాన్స్ కు కూడా క్లారిటీ వచ్చింది. నేరుగా తన సోదరుడు పవన్ కల్యాణ్ కూటమిని గెలిపించాలంటూ ఆయన తన అభిమానులకు విజ్ఞప్తి చేసినట్లు అనుకోవాల్సి ఉంటుంది. అయితే చిరంజీవి పై ఎన్ని ట్రోల్స్ చేసినా... ఇది కొంత వరకూ అధికార పార్టీకి కొంత నష్టం కలుగుతుందనే చెప్పాలి.
సినిమాలకే...
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పుకున్నారు. ఆయన సినిమాలకే పరిమితమయ్యారు. రాజకీయాల జోలికి అస్సలు రావడం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చిరంజీవి అస్సలు రాజకీయాలు అంటే ఆ వైపు చూడటం మానుకున్నారు. ఇదే విషయాన్ని అనేక ఇంటర్వూల్లో చెప్పారు కూడా. సినిమాలకే పరిమితమైన ఆయన తాను చివరలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకే ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించిందంటారు. అలా రాజకీయ మచ్చ లేకుండా నెట్టుకొస్తున్న చిరంజీవి మాత్రం ఈ ఎన్నికల్లో ఎందుకో ఒక్కసారి ఓపెన్ కావడం అందరికీ హాట్ టాపిక్ మా మారింది.
గత ఎన్నికల్లో...
2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సొంతంగా ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీ చేశారు. అప్పుడు కూడా ఆయన ఎలాంటి ప్రకటనలు చేయలేదు. దూరంగానే ఉన్నారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చే సరికి పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీతో కలసి బరిలోకి దిగారు. ఈ ఎన్నిక పవన్ పొలిటికల్ కెరీర్ కు అతి ముఖ్యం అందుకే ఆయన ఇటీవల తాను పవన్ కల్యాణ్ ను ఆహ్వానించి మరీ పార్టీ కోేసం ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. విరాళమివ్వడం వరకూ ఓకే .. కానీ తాజాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ కు మద్దతివ్వాలని ఆయన చేసిన ప్రకటన రాజకీయరంగు పులుముకుంది.
కూటమి అభ్యర్థులకు...
పేరుకు ఇద్దరు అభ్యర్థులను కూర్చుని చేసిన ప్రకటన అయినా చిరంజీవి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చారన్న విషయం ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. చిరంజీవి ప్రకటనను వైసీపీ తప్పు పుడుతున్నా అది ఆయన వ్యక్తిగత విషయం. తనకు ఎవరికి మద్దతివ్వాలని అనిపిస్తే వారికి ఇవ్వాలని చెప్పే స్వేచ్ఛ చిరంజీవికి ఉంటుంది. అందుకే చిరంజీవి పై చేసే విమర్శలు.. ట్రోల్స్ పెద్దగా నిలబడే అవకాశం లేదు. ఏపీలో ఎన్నికలు కీలకంగా మారి, పోటా పోటీగా జరుగుతున్న సమయంలో చిరంజీవి ఎంట్రీతో కొంత టర్న్ అవుతుందన్న అభిప్రాయం మాత్రం బలంగా వినపడుతుంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story