Sun Dec 22 2024 17:51:12 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh Exit Polls : ఫ్యాన్ స్వింగ్ లోనే ఉందట.. అయితే ఐదు లో కాదు.. రెండు లోనేనట
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ భారీ స్థాయిలో నమోదయింది. స్థానిక సంస్థలు కొంత ఓటర్ల నాడిని పసిగట్టే అవకాశముంది. ఎందుకంటే లోకల్ గా వారు ఏపీలో తీసుకునే నమూనాల సేకరణతో పాటు రాజకీయ అంశాలు, సామాజిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని చేస్తారు. అంటే జాతీయ మీడియా సంస్థలు ఇచ్చేవి తప్పు అనడం కరెక్ట కాదని అవి కూడా శాస్త్రీయంగానే నిర్వహిస్తాయి. అయితే లోకల్ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కు దగ్గరగా ఉంటాయి. ప్రధానంగా సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న సంస్థల ఎగ్జిట్ పోల్స్ ను నమ్మే అవకాశముంది. వారి ట్రాక్ రికార్డును పరిశీలిస్తే కొంత వరకూ ఎగ్జిట్ ఫలితాలు నిజమవుతాయని చెప్పకతప్పదు.
ఈసారి ఏం చెప్పిందంటే...
ఈసారి కూడా ఆరా మస్తాన్ చెప్పిన అంచనాలు కూడా నిజమయ్యే అవకాశాలున్నాయని జనం నమ్ముతున్నారు. ఆరా మస్తాన్ చెప్పిన దాని ప్రకారం అధికార పార్టీ వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలు, పదమూడు నుంచి పథ్నాలుగు లోక్సభ స్థానాలు వస్తాయని చెబితే విపక్ష కూటమి పది నుంచి పన్నెండు లోక్సభ స్థానాలు, 71 నుంచి 81 స్థానాలు వస్తాయని తెలిపింది. పార్టీలకు స్థానాలు వస్తాయని తేల్చి చెప్పాయి. పోలింగ్ శాతం పెరగడం వల్ల కూడా లబ్ది పొందారని కూడా ఆయన విశ్లేషించారు. సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి అన్నట్లు గా జరిగిన ఎన్నికల్లో చివరకు ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపారని ఆరా సంస్థ తెలిపింది. అంటే వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఆ సంస్థ వేసింది. మూడు పార్టీలు కలిసినా తలెత్తిన ఇబ్బందులు కూడా సంస్థ యజమాని ఆరా మస్తాన్ వివరించారు. టీడీపీ వైపు 51 శాతం పురుషులు మొగ్గు చూపారు.
గతంలో చేసిన సర్వేలు...
తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ చేసే ఎగ్జిట్ పోల్స్ కు కొంత విలువ ఉంది. అది గతంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చేసిన ఎగ్జిట్ పోల్స్ కు, తర్వాత వచ్చిన ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఆరా మస్తాన్ సంస్థ 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పగలిగారు. అలాగే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా రావడంతో ఆ సంస్థపై నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రెండే పార్టీలున్నాయి. ఒకటి వైసీపీ, మరొకటి కూటమి. రెండు పార్టీలు గట్టిగా ఉన్నాయి. రెండు పార్టీలకు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఆరా మస్తాన్ 2019 ఎన్నికలలో చెప్పిన ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఫలితాలు దగ్గరగా వచ్చాయి. ఆరా మస్తాన్ సంస్థ వైసీపీకి 119 నుంచి 126 స్థానాలు వస్తాయని చెబితే, టీడీపీకి 47 నుంచి 56 స్థానాలు వస్తాయని తెలిపింది.
Next Story