Mon Dec 23 2024 02:14:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు నాయుడు అంత లక్కీ ఫెలో.. మరొకరు లేరు.. యాచించే స్థాయి నుంచి శాసించేందుకు?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు దేశంలోనే కీలంకగా మారనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు దేశంలోనే కీలంకగా మారనున్నారు. ఎన్డీఏలో అత్యధిక స్థానాలను సాధించిన తెలుగుదేశం పార్టీకి అధినేతగా ఆయన రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి ఆయనకు మార్గం సుగమం అయింది. ఎందుకంటే దేశంలో గత రెండు ఎన్నికల కంటే భిన్నంగా రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. మోదీ ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు అవసరం ఎక్కువ. మొన్నటి వరకూ చంద్రబాబుకు మోదీ అవసరం ఉండగా నేడు అది రివర్స్ అయింది. దీంతో రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ పరిష్కరించేందుకు వీలు కలిగింది.
మోదీకి అవసరం...
కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ మద్దతు అవసరం బలంగా ఏర్పడింది. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి మార్గం సుగమమవుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కూడా వేగిరం కేంద్రం నుంచి క్విక్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలున్నాయి. మొన్నటి వరకూ అమరావతి ఢిల్లీ వైపు చేతులు చాచేది. ఇప్పుడు ఢిల్లీ అమరావతి వైపు చూస్తుంది. దాదాపు ఇరవై పార్లమెంటు స్థానాలకు పైగానే గెలుచుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంలో చేరి రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవడానికి, అదీ వేగంగా నిధులు తెచ్చుకోవడానికి వీలు కలిగింది.
శాసించే స్థాయికి...
మోదీకి డంపింగ్ మెజారిటీ రాకపోవడంతో గత జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని యాచించుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారింది. యాచించే స్థాయిలో ఏపీ ప్రభుత్వం ఉండదు. శాసించే స్థాయిలో చంద్రబాబు పైచేయి సాధించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ కు ఒకరకంగా చెప్పాలంటే మంచి రోజులు వచ్చినట్లే చెప్పాలి. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితులు కేవలం రాజకీయ పార్టీగా చంద్రబాబు నేతృత్వం వహించిన తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ కు పట్టిన అదృష్టంగా భావించాలి. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని చంద్రబాబు ఎంత మేరకు సక్సెస్ అవుతారన్నది మాత్రం చూడాలి.
Next Story