Ys Jagan : ఎవరో కానీ భలే రాశారబ్బా... జగన్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుందిగా
వైఎస్ జగన్ ఓటమికి అనేక కారణాలున్నాయి. అనేక విశ్లేషణలున్నాయి. కానీ కొన్ని కారణాలు మాత్రం ఓటమికి కారణమని చెప్పక తప్పదు
"సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర..లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా..భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా.. కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా..సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా.."అంటూ చెరసాలలో భక్తరామదాసు దీనంగా పాడుకునే పాట చాలమందికి తెలుసు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిన తర్వాత మాట్లాడిన మాటలు వింటుంటే ఈ పాట గుర్తుకొచ్చింది..ఆయన మాటల్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే- "52 లక్షల మంది అక్కచెల్లమ్మలకి అమ్మ ఒడిని ఇచ్చాను-ఆ ఓట్లేమైనాయో..? 66 లక్షలమంది అవ్వాతాతలకు, వికలాంగులకు గతంలో చూడని మంచి చేశాం.. వారి ఆప్యాయత ఏమయిందో...? కోటి ఐదు లక్షల మంది అక్కచెల్లమ్మలకు చేయూత, సున్నావడ్డీ, ఆసరాలతో తోడుగా ఉన్నాం- ఆ ప్రేమ ఏమయిందో..? పిల్లల చదువు కోసం ఎన్నో మార్పులు చేసి అండగా నిలిచాం- ఆ అభిమానం ఏమయిందో...?" ఇలా సాగింది ఆయన ప్రసంగం.
అనేక కారణాలు చెప్పొచ్చు...
అక్కడ రామదాసు తన ఇష్టదైవమైన రాముడికి ఖర్చుపెట్టింది సర్కారు డబ్బే..ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి తాను నమ్ముకున్న ప్రజలకి ఇచ్చిందీ సర్కారు డబ్బే..అంత చేసినా తనను చెరసాల పాలు చేసాడే రాముడు అని రామదాసు ఆక్రందన. ఇంత చేసినా తనను పదవీచ్యుతుడిని చేసారే ప్రజలు అని జగన్ మోహన్ రెడ్డి ఆవేదన.ఇక్కడ రామదాసుని, జగన్ మోహన్ రెడ్డితో పోల్చడంలేదు. విపరీతమైన విశ్వాసంతో కొన్ని పనులు చేసినప్పుడు ఊహించని ప్రతికూల ఫలితమొస్తే ఎలా ఉంటుందో ఒక పోలికతో చెప్పే ప్రయత్నమంతే. సరే..ఇంతకీ వైసీపీ ఎందుకు ఓడింది? అనే ప్రశ్నకి ఆ పార్టీ మీద ద్వేషం ఉన్నవాళ్లు ఎన్నైనా చెప్పేయచ్చు. జగన్ అభివృద్ధిని గాలొకొదిలేసాడు అనొచ్చు. బాబాయి హత్య కారణమనొచ్చు. చెల్లెలికి అన్యాయం చేసాడని వాదించొచ్చు. చంద్రబాబుని జైల్లో పెట్టడం వల్ల అనుకోవచ్చు. ఇవన్నీ వాళ్లు ఎప్పటి నుంచో చెబుతున్నవే. అయితే ఓటమికి ఇవి నిజంగా కారణాలో కాదో ఒక్కసారి ఆలోచిద్దాం.
చూపించకపోవడమే...