Mon Nov 18 2024 06:32:15 GMT+0000 (Coordinated Universal Time)
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి ఇదే లాస్ట్.. పొలిటికల్ కెరీర్‌కే డూ ఆర్ డై..?
గన్నవరం నియోజకవర్గంలో ఈసారి వైసీపీ గెలుపు కోసం శ్రమిస్తుంది. వల్లభనేని వంశీ ఇదే తన చివరి ఎన్నిక అని చెబుతున్నారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచే ప్రముఖ కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, కాకాణి వెంకటరత్నం లాంటి మహామహులు ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కంచుకోటగా ఉన్న గన్నవరంలో గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండు సార్లు గెలిచారు. ఆయన వైసీపీలోకి పోవడంతో టీడీపీకి నాయకత్వం ఉంటుందా అన్న సందేహాలు పటాపంచలు చేస్తూ గత ఎన్నికల్లో వంశీపై వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.గన్నవరంలో ప్రత్యర్థులు పాతవారే. కానీ వారి పార్టీలే అటూ ఇటూ అయ్యాయి.
పోటీపైనే సందేహాలు...
ఇక వంశీ అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా ? అన్న సందేహాలు వచ్చాయి. చివరి ఆరు నెలలు అసలు ఆయన నియోజకవర్గాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. వెంటనే వైసీపీ అధిష్టానం అలెర్ట్ అయ్యింది. ఎలాగోలా ఆర్థికంగా ఖర్చంతా భరిస్తాం అని ఆశలు చూపించి పోటీలో పెట్టింది. కానీ వంశీలో గత రెండు ఎన్నికల్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఈ ఎన్నికల్లో కనపడడం లేదు. ప్రచారం కూడా లైట్ తీస్కొంటున్నట్టుగా ఉంది.టీడీపీని వీడిన వంశీ చంద్రఃబాబు, లోకేష్.. చివరకు ఎన్టీఆర్ కుమార్తె అయిన బాబు భార్య భువనేశ్వఃరి, ఇటు లోకేష్ పుట్టుక గురించి చేసిన వ్యాఖ్యలు కేవలం కమ్మ సామాజికవర్గంలోనే కాకుండా ఇతర వర్గాల్లోనూ వంశీపై తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యాయి. ఆ తర్వాత వంశీ క్షమాపణ చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
కసితో అందరూ ఒకటయి...
ఇక టీడీపీలో యార్లగడ్డకు గ్రూపులు లేవు. పైగా వంశీపై కసితో అందరూ ఏకమయ్యారు. వంశీని వైసీపీలో అందరూ వ్యతిరేకిస్తున్నారు. దుట్టా వర్గం ముందు నుంచి వంశీని వద్దే అంటోంది. చివర్లో దుట్టా కుమార్తె, అల్లుడిని పక్కన పెట్టుకుని ప్రెస్‌మీట్ పెట్టిన వంశీ ఇవే తనకు చివరి ఎన్నికలు అని.. వచ్చే ఎన్నికల్లో ఆమె గన్నవరం వైసీపీ క్యాండెట్‌గా పోటీ చేస్తారని ప్రకటించడం కూడా వంశీ సెంటిమెంట్‌ను నమ్ముకున్నట్టు అర్థమవుతోంది.గతంలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వంశీ కొన్ని మంచి పనులే చేశారు. ఈ సారి పార్టీ మారి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నా కూడా ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేదన్న విమర్శ ుంది. పైగా అటు టీడీపీతో పాటు ఇటు స్వపక్షంలో ఉన్న నేతలను అణగదొక్కుతూ గ్రూపు రాజకీయాలతో కాలక్షేపం చేస్తూ అభివృద్ధి అన్న మాటే మర్చిపోయారు. కమ్మ వర్గం అయితే వంశీకి పూర్తి వ్యతిరేకంగా ఆయన్ను వెలివేసినట్టుగా ఉంది.
వైసీీపీకి ఇక్కడ కష్టమేనంటూ...
యార్లగడ్డకు వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది. పైగా ఆర్థికంగా బలమైన నేత కావడం కూడా వంశీలో కంగారెత్తిస్తోంది. వంశీ బాధితులు ఏ ఊర్లో.. ఏ పార్టీలో ఉన్నా కూడా వారిని ఏకం చేసిన ఘనత యార్లగడ్డకే దక్కుతుంది. ఈ సారి గన్నవరంలో ఎవరిని అడిగినా వంశీ గెలవడు అనే వాళ్లే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. గన్నవరం అంటే.. పసుపు పార్టీకి కంచుకోట. 1989లో చివరిసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 2009 నుంచి గన్నవరంలో వరుసగా మూడుసార్లు టీడీపీ గెలిచింది. వైసీపీకి ఇక్కడ గెలుపు అన్నదే లేదు. ఏదేమైనా ఈ ఎన్నికలు వంశీ పొలిటికల్ కెరీర్‌కు కీలకం.. ఆయనకు డూ ఆర్ డై లాంటివి. వంశీ ఓడితే అతడి పొలిటికల్ కెరీర్ ఎండింగ్ వైపు వెళుతున్నట్టుగా సిగ్నల్స్ వచ్చేసినట్టే అనుకోవాలి.
Next Story