Sun Dec 22 2024 23:16:54 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections Counting : జగన్ ప్రభుత్వంపై బయటకు కనిపించని అసంతృప్తి... ఊహించని ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ లో ఊహించని ఫలితాలు కనిపిస్తున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా ఓట్లు జనం వేశారని అర్థమవుతుంది
ఆంధ్రప్రదేశ్ లో ఊహించని ఫలితాలు కనిపిస్తున్నాయి. వారు లేదు.. వీరులేదు... ఎవరు బడితే వాళ్లు ఓటమి దిశగా ప్రయాణిస్తున్నారు. అన్ని వర్గాల ఓటర్లు ఒకవైపు నిల్చుని జగన్ ను ఓడించడానికే బటన్ నొక్కారని అర్థమవుతుంది. సంక్షేమపథకాలు తనను కాపాడతాయని భావించిన జగన్ కు ఈ ఎన్నికల్లో ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లే కనపడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని ప్రజలు బలంగా కోరుకున్నారని అర్థమవుతుంది.
ఇరవై ఏళ్లుగా...
ఇరవై ఏళ్లుగా గెలవని చోట కూడా టీడీపీకి అనుకూలంగా ఓట్లు పడుతున్నాయి. మాచర్ల, సంతనూతలపాడు, పూతలపట్టు, సత్యవేడు, తిరుపతి పార్లమెంటు వంటి చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉండటంతో ఇక వన్ సైడ్ పోలింగ్ అన్నది స్పష్టమవుతుంది. రాజంపేటలోనూ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే పది చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండటం, బీజేపీ పది చోట్ల పోటీ చేస్తే మూడు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ట్రెండ్స్ మొత్తం...
ఇలా ట్రెండ్స్ మొత్తం వన్ పైడ్ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ బలంగా ఉందని భావించిన అన్ని స్థానాల్లో టీడీపీ లీడ్ లోకి వస్తుండటం చూస్తే మాత్రం ప్రజలు కులాలకతీతంగా, మహిళలు, పురుషులు, ఉద్యోగులు అందరూ ఒకవైపు నిలిచారు. జగన్ కు వ్యతిరేకంగా ఇంత పెద్ద స్థాయిలో ఓటర్లు బటన్ నొక్కారు అంటే ప్రభుత్వాన్ని మరాలని బలంగా కోరుకుంటున్నారని అర్థమవుతుంది. ఈ ట్రెండ్స్ అధికారంలోకి వస్తే 150కి పైగా స్థానాల్లో టీడీపీ విజయం సాధించే అవకాశాలున్నాయి.
Next Story