Sat Dec 21 2024 08:24:56 GMT+0000 (Coordinated Universal Time)
TDP : అన్నా లేడు.. పార్టీ లేదు.. ఏక్ నిరంజన్.. నో బ్లడ్ రిలేషన్
తుని నియోజకవర్గం టిక్కెట్ తనకు దక్కక పోవడంతో యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు
రాజకీయాలలో ఎవరి పదవులు వారికే ముఖ్యం. కుటుంబ సభ్యులలో అయినా పెద్దగా పట్టించుకోరు. తాము మాత్రమే పదవి పొందాలనుకుంటారు. ఇందులో రక్తసంబంధానికి ఏమాత్రం తావులేదు. భార్యాభర్తలు కూడా సీట్ల కోసం సిగపట్లు పడుతున్నారంటే రాజకీయాలంటే ఎంత క్రేజ్ గా మారాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్లు అనేక మంది వేర్వేరు పార్టీలను చూసుకుంటున్నారు. తమకు రాజకీయంగా అన్యాయం జరిగిందన్న భావన కలిగినప్పుడు వారికి బ్లడ్ రిలేషన్ అనేది గుర్తుకు రాదు. ఒన్లీ పొలిటికల్ కంపల్షన్ మాత్రమే వారి మైండ్ లో కదులాడుతుంటుంది. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీల్లో అలాగే ఉంది.
యనమల సోదరుడు...
తాజాగా తుని నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు ఆయన సోదరుడు భారీ షాక్ ఇవ్వనున్నారు. తుని నియోజకవర్గం టిక్కెట్ తనకు దక్కక పోవడంతో యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయన త్వరలోనే వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తుని అసెంబ్లీ సీటును ఈసారి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యకు పార్టీ టిక్కెట్ కేటాయించింది. ఆయన ఈ నెల 27వ తేదీన వైసీపీలో చేరతారన్న ప్రచార జరుగుతుంది. ఈరోజు కాకినాడ ఎంపీ చలమలశెట్టి సునీల్ నామినేషన్ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారని చెబుతున్నారు.
రెండుసార్లు పోటీ చేసి...
యనమల కృష్ణుడు వరసగా రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు కావడంతో ఈసారి పార్టీ అధినాయకత్వం అభ్యర్థిని మార్చింది. దీంతో పాటు యనమల రామకృష్ణుడు కూడా తనను దూరం పెట్టారన్న ఆలోచన లో ఉన్న కృష్ణుడు పార్టీని వీడటమే బెటర్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది. నిజంగా యనమల కృష్ణుడు టీడీపీని వీడి వైసీీపీలో చేరితే ఆ పార్టీకి తుని నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ అవుతుంది. యనమల కుటుంబంలో ఆయన ఎమ్మెల్సీగా ఉండగా, కుమార్తెకు అసెంబ్లీ సీటు ఇచ్చారని, అల్లుడికి ఏలూరు పార్లమెంటు టిక్కెట్ ఇచ్చి తనకు అన్యాయం చేశారంటూ యనమల కృష్ణుడు తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Next Story