Mon Dec 23 2024 20:10:50 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : బోగస్ బాబును నమ్ముతారా? మంచిచేసిన మీ బిడ్డ జగన్ ను విశ్వసిస్దారా?
పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ముగింపు పలుకుతారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ముగింపు పలుకుతారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఐదేళ్లు జనాల రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది చంద్రముఖి అని అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పుడవుతున్న అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకే ఓటు వేయాలని కోరారు. ఎవరి విశ్వసనీయత ఏంటి? అనేది తెలుసుకుని మరీ ఓటు వేయాలని ఆయన పిలుపు నిచ్చారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదని, పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని జగన్ అన్నారు.
ఒక్క పథకం కూడా...
పథ్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాదని ఆయన అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడైనా ఉద్యోగాల నియామకం జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు. రైతులను నిట్టనిలువునా ముంచింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. రైతురుణ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో అందరికీ తెలుసునని అన్నారు. సున్నా వడ్డీకే రుణాలు ఈ పెద్దమనిషి ఇచ్చాడా? అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అన్నది ఎవరు అని ప్రజలను జగన్ ప్రశ్నించారు. బషీర్ బాగ్ లో కాల్పులు జరిపింది ఈ చంద్రబాబు కాదా? అని అన్నారు.
ఐదేళ్లలో జగన్ చేసిన...
ఐదేళ్లలో జగన్ చేసిన ప్రోగ్రెస్ మీకు అందరికీ తెలుసునని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామన్నారు. అదే చంద్రబాబు పాలనలో ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. అదే చంద్రబాబుది బోగస్ రిపోర్టు అంటూ జగన్ ఫైర్ అయ్యారు. గ్రామాల్లో అనేక ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయన్నారు. చంద్రబాబు తన పాలనలో 17 మెడికల్ కళాశాలలు కట్టావా? అని ప్రశ్నించారు. హార్బర్ లను కట్టావా? అని నిలదీశారు. మీ జగన్ లా వెలుగొండ నీటిని ప్రకాశం జిల్లాకు తీసుకు వచ్చావా? అని ప్రశ్నించారు. ఇండ్రస్ట్రియల్ క్యారిడార్ ను ఏర్పాటు చేసింది ఎవరు అంటూ జగన్ ప్రశ్నించారు. ఈ బోగస్ బాబును నమ్ముతారా? మీ జగన్ ను నమ్ముతారా? అని ఆయన ప్రశ్నించారు.
Next Story