Sun Nov 17 2024 21:27:48 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : అయోధ్యను మందిరం.. స్వర్ణంతో
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ జిల్లాకు చెందిన కపిలవాయి గోపి అయోధ్య రామమందిరానని బంగారంతో తయారు చేశారు
అయోధ్యలోని రామమందిరాన్ని బంగారంతో తయారు చేశాడు ఒక యువకుడు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ జిల్లాకు చెందిన కపిలవాయి గోపి స్వర్ణకారుడు. ఆయన అయోధ్యలో రామందిరం నమూనాతో బంగారంతో తయారు చేశారు. ఇది చూపరులను ఆకట్టుకుంటుంది. రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ బంగారంతో రామమందిరాన్ని తయారు చేయడంతో చూసేందుకు అనేక మంది వచ్చి ఆయన పనితీరును ప్రశంసిస్తున్నారు.
తయారు చేయడానికి...
ఈ రామమందిరం తయారు చేయడానికి 2.730 మిల్లి గ్రాముల బంగారాన్ని వినియోగించారు. ఈ రామమందిరం ఎత్తు 1.5 సెంటీమీటర్లు కాగా, వెడల్పు 1.75 సెంటీమీటర్లు. ఈ మందిరంలో అచ్చం అయోధ్యలో నిర్మించినట్లుగానే ఇరవై గోపురాలు, 108 పిల్లర్లు, విల్లును తయారు చేశరు గోపి. తాను తయారు చేసిన ఈ స్వర్ణమందిరాన్ని ప్రధాని మోదీకి చూపించాలన్న కోరికను ఆయన వెల్లడించడం విశేషం. అతి చిన్న స్వర్ణ రామమందిరం విశేషంగా ఆకట్టుకుంటుంది.
Next Story