Fri Nov 22 2024 08:36:23 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు CBSE కీలక సూచన
విద్యార్థులకు పాఠశాలలు మొదలవుతూ ఉన్నాయి. విద్యార్థుల సిలబస్ కు సంబంధించిన లింక్స్ అంటూ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి లింక్స్ మీద క్లిక్ చేయడం చాలా ప్రమాదకరం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కొన్ని వెబ్సైట్లు,
విద్యార్థులకు పాఠశాలలు మొదలవుతూ ఉన్నాయి. విద్యార్థుల సిలబస్ కు సంబంధించిన లింక్స్ అంటూ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి లింక్స్ మీద క్లిక్ చేయడం చాలా ప్రమాదకరం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కొన్ని వెబ్సైట్లు, పోర్టల్‌ల ద్వారా సిలబస్, స్టడీ మెటీరియల్, నమూనా ప్రశ్నపత్రాలకు సంబంధించిన సమాచారం పట్ల జాగ్రత్త వహించాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేసింది. నమూనా ప్రశ్నపత్రాలు, పాఠ్యాంశాలు, కార్యకలాపాలకు సంబంధించి కొన్ని వెబ్సైట్లు, పోర్టల్‌లు అవుట్ డేటెడ్ లింక్‌లు, ధృవీకరించని కథనాలను ప్రసారం చేస్తున్నాయని CBSE పేర్కొంది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, అనధికార మూలాల నుండి వచ్చే సమాచారం విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించవచ్చని.. యాజమాన్యం, ఉపాధ్యాయులలో కూడా అనవసరమైన గందరగోళాన్ని కలిగించవచ్చని CBSE తెలిపింది.
CBSE తాము సూచించిన కొన్ని వెబ్సైట్లను ఫాలో అవ్వాలని సూచించింది. ముఖ్యంగా CBSEకి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే అనుసరించాలని, విశ్వసించాలని ప్రజలను కోరింది..
CBSE అధికారిక వెబ్ సైట్ ఇదే
అదనంగా, CBSE కి సంబంధించిన వివిధ అంశాలైన.. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రకటనలు, సర్క్యులర్లు, నోటీసులు మొదలైన వాటి కోసం, క్రింది అధికారిక వెబ్సైట్లు/మైక్రోసైట్లను సందర్శించాలి:
1. CBSE అకడమిక్ విషయాల కోసం నమూనా ప్రశ్న పత్రాలు, సబ్జెక్టులు, పాఠ్యాంశాలు మరియు సంబంధిత వనరులు, ప్రచురణలు, విద్య నైపుణ్య సంబంధిత వివరాలు కార్యక్రమాలు, SAFAL, మొదలైన వాటికోసం.
2. CBSE ఫలితాలు - CBSE పరీక్షల ఫలితాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి
3. CTET - సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం
4. PRASHIKSHAN TRIVENI -ట్రైనింగ్ సంబంధిత వివరాల కోసం
5. CBSE SARAS - ఇంటిగ్రేటెడ్ ఇ-అఫిలియేషన్ సిస్టమ్ గురించి
6. PARIKSHA SANGAM -పరీక్షలు సంబంధిత కార్యకలాపాలు
సరైన, తాజా సమాచారం కోసం ఈ అధికారిక లింక్ లపై మాత్రమే ఆధారపడాలని CBSE కోరుతోంది.
X, XII తరగతుల సప్లిమెంటరీ పరీక్షల 2024 అధికారిక షెడ్యూల్ ను విడుదల చేశారు. పదో తరగతి CBSE సప్లిమెంటరీ పరీక్ష 2024 జూలై 22న ముగుస్తుంది, అయితే XII తరగతి సప్లిమెంటరీ పరీక్ష జూలై 15న నిర్వహించనున్నారు.
- Tags
- CBSE
- Explainers
Next Story