Mon Dec 23 2024 00:06:10 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేటి నుంచి ఐపీఎల్ .. కావాల్సినంత వినోదం
ఐపీఎల్ పదిహేడో సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. చెన్నై లోని చెపాక్ స్టేడియంలో ఈ సీజన్ ప్రారంభం కాబోతుంది
ఐపీఎల్ పదిహేడో సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. చెన్నై లోని చెపాక్ స్టేడియంలో ఈ సీజన్ ప్రారంభం కాబోతుంది. మొత్తం పది జట్లు ఈ సీజన్ లో కప్ కోసం పోరాడుతున్నాయి. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లతో కూడిన జట్లు అభిమానులు నెలల పాటు అలరించనున్నాయి. కెప్టెన్లు జట్లకు మారారు. ముంబయి ఇండియన్స్ హార్థిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ కు శుభమన్ గిల్, చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ లు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. నేడు ఆరంభ వేడుకలో ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ తో పాటు, అక్షయ్ కుమార్ వంటి సెలబ్రిటీలతో ప్రేక్షకులను అలరించనున్నారు
తొలి మ్యాచ్...
నేడు చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు ఉంటాయి. అందుతున్న సమాచారం మేరకు మే 26వ తేదీ ఫైనల్స్ ఉండే అవకాశముందని తెలుస్తోంది. అన్ని జట్లు బలంగా ఉండటంతో ఈసారి కప్ ఎవరిదన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాత్రి 8 గంటలకు ఈరోజు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మ్యాచ్లు ప్రకటించిన స్టేడియాలలో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం మీద రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే.
Next Story