Mon Dec 23 2024 02:26:29 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఆఖరిప్రయత్నం కోసం ఇరు జట్లు
ీఈరోజు మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది
ఐపీఎల్ పదిహేడో సీజన్ చివరి దశకు చేరకుంది. ప్లేఆఫ్ కోసం అన్ని జట్లు ప్రయత్నిస్తున్నాయి. శ్రమిస్తున్నాయి. తమ శక్తి వంచన లేకుండా ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్లే ఆఫ్ కు వచ్చి కనీసం సెమీ ఫైనల్స్ లో అడుగుపెట్టాలని ప్రతి జట్టు కోరుకుంటుంది. కానీ ప్లేఆఫ్ కు చేరేది మొదటి నాలుగు జట్లు మాత్రమే కావడంతో మిగిలిన ఆరు జట్లు ఇంటికి వెళ్లాల్సిందే. మే 24వ తేదీన ఐపీఎల్ ఫైనల్స్ కు ఎవరు చేరుకుంటారన్నది పక్కన పెడితే అసలు ప్లేఆఫ్ కు అర్హత సాధించే జట్లు ఏంటన్న దానిపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నేడు అహ్మదాబాద్ లో...
ీఈరోజు ఐపీఎల్ లో మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ పెద్దగా ఈ సీజన్ పెర్ఫార్మెన్స్ చూపలేకపోయింది. మొదట్లో కొన్ని విజయాలు సాధించినా ఆ తర్వాత ఫామ్ లేక జట్టు ఇబ్బంది పడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా కొంత పరవాలేదనిపిస్తుంది. ఇరు జట్లు ఈ మ్యాచ్ ను ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అందుకోసం రెండు జట్లు మైదానంలో పోరాడనున్నాయి.
Next Story