Mon Dec 23 2024 15:16:35 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేడు మరో సూపర్ మ్యాచ్
ఈరోజు మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ టీంలు నేడు తలపడనున్నాయి.
ఐపీఎల్ లో ఏ జట్టు గెలుస్తుంది చెప్పలేని పరిస్థితి. అంచనాలు ఉన్న జట్లు తలకిందులవుతున్నాయి. ఆరంభంలో ఇబ్బందిపడిన జట్లు తిరిగి పుంజుకుని ప్లేఆఫ్ కు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తేనే గేమ్ లో విజయం వరిస్తుందన్నది అందరికీ తెలిసిందే. కానీ ఐపీఎల్ లో మాత్రం ఎవరో ఒకరు క్లిక్ అయితే చాలు ఇక ఆ మ్యాచ్ మన చేతికి వచ్చినట్లే. అందుకోసమే ఐపీఎల్ కు అంత మంది అభిమానులున్నారు. ప్రతి సీజన్ కు ఆ సంఖ్య పెరుగుతూ వెళుతుంది.
రెండు జట్లు...
ఈరోజు మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ టీంలు నేడు తలపడనున్నాయి. రెండు జట్లు అంచనాలు లేకుండా దిగినవే. తొలుత కొంత తడబడినా తర్వాత మాత్రం రెండు జట్లు పుంజుకున్నాయి. హైదరాబాద్ జట్టు రికార్డులను బ్రేక్ చేస్తూ వెళుతుంది. ముంబయి, బెంగళూరు జట్లపై అత్యధిక స్కోరు చేసింది. ఇక ఢిల్లీ కాపిటల్స్ కూడా అదే స్థాయిలో ఆడుతుంది. ఆరంభంలో కొంత ఇబ్బంది పడినా ఇప్పుడు కొంత తేరుకున్నట్లే కనిపిస్తుంది. మరి ఈరోజు మ్యాచ్ ఎవరి పరం అవుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story