Mon Dec 23 2024 07:36:00 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
ఆదివారం కావడంతో నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి.
ఐపీఎల్ లో 17వ సీజన్ ఇక ఐదు రోజులు మాత్రమే ఉంది. ఈరోజుతో దాదాపు అన్ని మ్యాచ్ లు ముగిసిపోతాయి. ప్లే ఆఫ్ కు చేరుకునే జట్లపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్ లతో మరింత క్లారిటీ రానుంది. రేపటి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి. అంచనాలకు అందని విధంగా ఈసారి ఐపీఎల్ లో అనేక జట్లు ప్లే ఆఫ్ లో దూసుకు వచ్చాయి. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేరింది. ఈరోజు మ్యాచ్ తో నాలుగో జట్టు ఏదో తేలనుంది.
ఆదివారం కావడంతో...
ఆదివారం కావడంతో నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. రాత్రి ఏడు గంటలకు రాజస్థాన్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. అయితే కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రమే. ఎందుకంటే రెండూ ఇప్పటికే అధికారికంగా ప్లే ఆఫ్ కు చేరాయి. అయితే పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ ను ఓడిస్తే మాత్రం సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. మరి ఈ మ్యాచ్ రిజల్ట్ కోసమే ఎక్కువగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Next Story