Fri Dec 20 2024 17:18:15 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : పాండ్యాపై పగబట్టినట్లుందిగా.. కెప్టెన్సీ వదిలేయ్ సామీ
సొంత మైదానం ముంబయిలోనూ ముంబయి ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోవడంతో పాండ్యాకు కెప్టెన్సీ కలసి రాలేదని పిస్తుంది
ఏ ముహూర్తంలో హార్ధిక్ పాండ్యా ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడో అప్పటి నుంచి అన్నీ పరాజయాలే. వరస విజయాలు వెంటాడుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ గా ఉన్నప్పుడు ఒకసీజన్ లో కప్పు కొట్టేశాడు. మరొక సీజన్ లో జట్టను ఫైనల్ కు చేర్చాడు. కానీ ముంబయి జట్టు మాత్రం పాండ్యాకు కలసి రాలేదనిపిస్తుంది. సొంత మైదానం ముంబయిలోనూ ముంబయి ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో పాండ్యాకు కెప్టెన్సీ కలసి రాలేదని పిస్తుంది. అసలు ముంబయి బ్యాటింగ్ చూసిన వారికి పాండ్యాపై పగబట్టారా? ఏంటి? అన్న అనుమానం కూడా కలిగింది. మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు. ఒక పరుగు.. రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది.
1/2.. ఇదేంటి గురూ...
ఒక పరుగుకు రెండు వికెట్లు స్క్రీన్ మీద చూసిన వారెవ్వరకైనా ఇదే అనుమానం. బ్యాట్ పట్టుకు వచ్చిన నమన్ ధీర్ డకౌట్ అయ్యాడు. బౌల్డ్ చేతిలో బలయ్యాడు. బౌల్ట్ మూడు వికెట్లు వరసగా తీయడంతో ముంబయి ఇండియన్స్ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. తర్వాత వచ్చిన బ్రెవిస్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఇషాన్ కిషన్ పరవాలేదు ఆడుతున్నాడులే అనుకుంటే పదహారు పరుగుల వద్ద బర్గర్ అవుట్ చేశాడు. దీంతో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, తిలక్ వర్మ కలసి ఇన్నింగ్స్ ను కొంత చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
పాండ్యా, తిలక్ లు...
వికెట్లు పడిపోతుండటంతో ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూ మరొక వైపు షాట్లు కొడుతూ స్కోరును బాగానే పరుగులు పెట్టించారు. 9 ఓవర్లకు 75 పరుగులు చేయడంతో పరవాలేదనిపించినా, తర్వాత హార్థిక పాండ్యా అవుట్ కావడంతో ఇక వరస బెట్టి క్యూ కట్టారు. చివరకు టిమ్ డేవిడ్ కూడా టీం ఆశలు నిలబెట్టలేదు. కేవలం పదిహేడు పరుగులు మాత్రమే చేశాడు. 9 వికెట్లు కోల్పోయిన ముంబయి ఇండియన్స్ కేవలం 125 పరుగులు మాత్రమే చేసి రాజస్థాన్ రాయల్స్ కు మ్యాచ్ ను అప్పగించేసింది.
పరాగ్ మరోసారి...
126 టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ తొలి దశలో వికెట్ కోల్పోయినా ఆ తర్వాత సర్దుకుంది. ఎప్పటిలాగానే పరాగ్ మళ్లీ విజృంభించి ఆడాడు. 54 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. కేవలం 15.3 ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. దీంతో రాయల్స్ కు వరసగా మూడో విజయం దక్కి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ముంబయి చివరి స్థానానికి పడిపోయింది. ముంబయి ఇండియన్స్ ఇలా ఘోరంగా పరాభావం పాలవ్వడాన్ని దాని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Next Story