Sat Dec 21 2024 10:43:04 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : కావ్య బేబీ ఫీలింగ్స్ చూస్తే.. ఇన్ని వేరియేషేషన్లున్నాయా? ఉగ్గబట్టి...?
నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ కావ్య మారన్ ఫీలింగ్స్ ను కెమెరాలు పట్టేశాయి
ఐపీఎల్ లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఈ బాదుడేంది సామీ అని అనిపించక మానదు. రెండు జట్లు ఎవరికీ ఎవరు తగ్గకుండా వీర విహారం చేశాయి. ఒకరికి ఒకరు తక్కువ కాదన్నట్లుగా మైదానంలో ఫ్యాన్స్ ను అలరించాయి. అసలు తమ జట్ల అభిమానులను నిమిషం పాటు కూర్చోకుండా చేశాయంటే ఐపీఎల్ లో ఇలాంటి మ్యాచ్ ఇప్పటి వరకూ మరెన్నడూ చూడలేదనే చెప్పాల్సి ఉంటుంది.
సిక్సర్ కొట్టినప్పుడల్లా...
రెండు జట్లు అత్యధిక స్కోర్లు .. అంతే కాదు... బ్యాటర్లు వీరవిహారం... సిక్సర్లు... ఫోర్లు.. బంతి ఆకాశం వైపు బుల్లెట్ లా దూసుకెళ్లింది. అదే సమయంలో అంతే వేగంతో గ్రౌండ్ పై బౌండరీ లైన్ దాటేసింది. ప్రతి బంతి అంతే. హైదరాబాద్ సన్ రైజర్స్ లో ఆటగాళ్లు నిన్నటి మ్యాచ్ లో మొత్తం 22 సిక్సర్లు కొట్టారంటే ఇక చూడాల్సిందే మరి. 19 ఫోర్లు బాదేశారు. అలా ఆడేశారు మనోళ్లు. ఇక ఆ జట్టు ఫ్యాన్స్ కే అలా ఉంటే జట్టు యజమాని కావ్య మారన్ కుదరుగా ఎందుకు కూర్చుంటుంది. లేచి నిల్చోవడానికే కావ్యకు సమయం సరిపోలేదు. తమ జట్టు సభ్యులు సిక్సర్ బాదినప్పుడల్లా చప్పట్లతో కావ్య మారన్ కనిపించింది.
బెంగళూరు ఆడుతున్నప్పుడు...
మళ్లీ బెంగళూరు జట్టు కూడా అదే స్థాయిలో ఆడింది. దినేశ్ కార్తీక్ ఆడుతున్నంత సేపు మ్యాచ్ ని ఎగరేసుకుపోతారని పించింది. దినేశ్ కార్తీక్ ఏడు సిక్సర్లు బాదాడు. అంతే దినేష్ కార్తీక్ ఆడుతున్నంత సేపు ఉగ్గబట్టి... ఊపిరి బిగబట్టి చూస్తూనే ఉండిపోయింది కావ్య మారన్. ఆమె మాత్రమే కాదు.. రెండు జట్ల అభిమానుల పరిస్థితి కూడా అంతే. అందుకే ఈ మ్యాచ్ కేవలం కావ్యమారన్ కు మాత్రమే కాదు... ఇటు అన్ని జట్ల ఫ్యాన్స్ కు ఆనందాన్ని పంచిపెట్టాయి. ఫస్ట్ హాఫ్ లో ఆనందమయితే.. రెండో హాఫ్ లో ఆందో్ళన కనిపించింది.. కెమెరాలు కూడా కావ్య చుట్టూ తిరిగి ఆమె హావభావాలను రికార్డు చేశాయి.
Next Story