Sun Nov 17 2024 09:47:50 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నాలుగో స్థానం కోసం ధోని, కోహ్లి జట్లు పోరాటం.. ఫ్యాన్స్ ఆసక్తికగా ఎదురు చూపులు
ఐపీఎల్ లో ప్లేఆఫ్ లో నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పోటీ పడుతున్నాయి.
ఐపీఎల్ సీజన్ 17 త్వరలోనే ముగియనుంది. లీగ్ మ్యాచ్ లు పూర్తయి ప్లేఆఫ్ లోకి ప్రవేశించనుంది. మే 24వ తేదీన ఫైనల్స్ లో ఏ ఏ జట్లు తలపడతాయన్నది పక్కన పెడితే ప్లే ఆఫ్ కు చేరే నాలుగో జట్టు పైనే ఇప్పుడు చర్చంతా జరుగుతుంది. ఈ సీజన్ లో మొత్తం పది జట్లు పాల్గొన్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ కాపిటల్స్ జట్లు దాదాపుగా ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్నట్లే. ఇక ఆరు జట్లలో మూడు ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. కోల్్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే అధికారికంగా ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. దీంతో నాలుగో జట్టు ఏంటన్న దానిపైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రెండు జట్లలోనే...
నిన్న గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్ రైజర్స్ అధికారికంగా ప్లేఆఫ్ కు చేరుకునట్లే. చెరొక పాయింట్ రావడంతో ఆ జట్టు ఆడకుండానే ప్లేఆఫ్ కు చేరుకుంది. ఇక రెండు జట్లకు మాత్రమే ఛాన్స్ ఉన్నాయి. ప్లే ఆఫ్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ కాపిటల్స్ కూడా ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే. చెన్నై, బెంగళూరు జట్లకే ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. ఈ రెండు జట్లలో కొంత కష్టపడితే చాలు రెండు జట్లలో ఒకటి ప్లే ఆఫ్ కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ దానికి అదృష్టం కూడా తోడవ్వాల్సి ఉంటుంది. అన్నీ కలసి వస్తేనే మైదానంలో చివరి బంతి కూడా గెలుపును పలకరిస్తుంది. లేకుంటే అదే బంతి ఓటమి బాటను పట్టిస్తుంది.
రేపటి మ్యాచ్ లు...
రేపు చెన్నై సూపర్ కింగ్స్ , బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే నేరుగా అది ప్లే ఆఫ్ కు చేరినట్లే. బెంగళూరు నిలవాలంటే భారీ స్కోరుతో చెన్నైపై విజయం సాధించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం చెన్నై ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఇవన్నీ అదృష్టంతో పాటు ఆట మీద ఆధారపడి ఉంటుంది. రెండు జట్లు మంచి ఊపు మీదున్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. చెన్నై ఆరంభంలో అదరగొట్టినా.. రాను రాను ఫామ్ లేమితో అది కొట్టుమిట్టాడుతుంది. ఇక బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రం ప్రారంభంలో చెత్త ప్రదర్శన చేసి చివరలో పుంజుకుంది. మరి నాలుగో స్థానం ఎవరు దక్కించుకుంటారన్నది రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశముందన్నది క్రీడానిపుణుల అంచనా. అందుకే రెండు జట్ల ఫ్యాన్స్ రేపటి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.
Next Story