Mon Dec 23 2024 00:01:02 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : జడ్డూ భయ్యా నువ్వు సూపరహే.. బౌలింగ్ అంటే అలా చేయాలి మరి
చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నైది గెలుపు అయింది.
చెన్నైై సూపర్ కింగ్స్ కు విజయం దక్కింది. వరస ఓటములతో ఉన్న జట్టుకు జడేజా ప్రాణం పోసినట్లయింది. నిన్న జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ వరస విజయాలకు చెన్నై సూపర్ కింగ్స్ చెక్ పెట్టింది. కోల్కత్తా నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచ్ లలో గెలుపు బాట పట్టింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అలాంటి నైట్ రైడర్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ చెక్ పెట్టింది. అతి సులువుగా విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నైది గెలుపు అయింది. గెలుపు ఏకపక్షంగా నిలిచింది.
వరస పెట్టి అవుట్...
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత్తా నైట్ రైడర్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. తర్వాత నరేన్, రఘువంశీ కొంత దూకూడుగా ఆడుతూ కనిపించినా వారి భాగస్వామ్యానికి జడేజా అడ్డుకట్ట వేశాడు. దీంతో అప్పటి నుంచి నైట్ రైడర్స్ వికెట్ల పతనం ప్రారంభమయింది. ఇక వరసగా వికెట్లు పడుతుండటంతో శ్రేయస్ అయ్యర్ కొంత నిలదొక్కుకున్నట్లే కనిపించాడు. హిట్టర్ వెంకటేశ్ అయ్యర్ కూడా అవుట్ కావడంతో తక్కువ స్కోరుకే నైట్ రైడర్స్ అవుట్ అయింది. ఇరవై ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది.
తక్కువ స్కోరు కావడంతో...
ఐపీఎల్ లో ఇది చాలా తక్కువ స్కోరు అనే చెప్పాలి. అందులోనూ ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ కావడంతో విజయం పై ఎవరికి పెద్దగా అనుమానాలు లేవు. జడేజా మూడు వికెట్లు తీశాడు. తర్వాత బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 67 పనరుగులు చేశఆడు. శివమ్ దూబే మరోసారి బ్యాట్ ను ఝుళిపించాడు. 28 పరుగులు చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విజయాన్ని దక్కించుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై ఐదు మ్యాచ్ లు ఆడి మూడింటిలో గెలిచినట్లయింది.
Next Story