Mon Dec 23 2024 03:15:47 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్
ఈరోజు కోల్కత్తా నైట్ రైడర్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్లు తలపడుతుంది.
ఐపీఎల్ లో అద్భుతాలు జరుగుతున్నాయి. ముందు మంచి పెర్ఫార్మెన్స్ చూపించిన జట్లు వచ్చే కొద్దీ కొంత వెనకబడుతున్నాయి. తొలుత ఓటమితో ప్రారంభించిన జట్లు తేరుకుని విజయాల బాట పడుతున్నాయి. అలా ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు పది టీంలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. రికార్డులను తిరగరాస్తూ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. బౌలర్లు కూడా ఆరెంజ్ క్యాప్ కోసం శ్రమిస్తున్నారు. ఇలా ఇప్పటికే అనేక జట్లు ఊహించని రీతిలో పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని ఎగబాకేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
రెండు జట్లు...
ఈరోజు కోల్కత్తా నైట్ రైడర్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్లు తలపడుతుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ ఫస్ట్ నుంచి మంచి ఫెర్ఫార్మెన్స్ చూపుతుంది. ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ తో ఓటమి పాలయింది. అయితే అదే సమయంలో ఢిల్లీ జట్టు తొలిదశలో అన్నీ వైఫల్యాలే. కానీ ఆ తర్వాత వరస విజయాలతో దూసుకు పోతుంది. ఇలా ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది. రాత్రి 7.30 గంటలకు కోల్కత్తాలో జరిగే మ్యాచ్ లో ఎవరిది విజయం అన్నది తేలనుంది.
Next Story