Mon Dec 23 2024 07:52:41 GMT+0000 (Coordinated Universal Time)
MS Dhoni : అదే వేగం.. వికెట్ల వెనక ధోనీ స్పీడ్ చూసిన వారికి ఎవరికైనా?
ఎంఎస్ ధోనీ నలభై పదులు వయసులో పడినా వేగం ఏ మాత్రం తగ్గలేదు. వికెట్ కీపింగ్ లో అదే కదలికలతో అభిమానులను అబ్బురపరుస్తున్నాడు
ఎంఎస్ ధోనీ నలభై పదులు వయసులో పడినా వేగం ఏ మాత్రం తగ్గలేదు. వికెట్ కీపింగ్ లో అదే కదలికలతో అభిమానులను అబ్బురపరుస్తున్నాడు. నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లోనూ వికెట్ల వెనక ధోని కదలికలను చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. అంతర్జాతీయ మ్యాచ్ లకు గుడ్ బై చెప్పిన ధోనీ కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. వికెట్ కీపింగ్ ను మాత్రం ధోనీ వదిలపెట్టలేదు. తనకు ఇష్టమైన కీపింగ్ ప్యాడ్లతో మైదానంలోకి చేరుకోవడంతోనే ఫ్యాన్స్ నుంచి కేకలు వినిపించాయి.
అనేక అనుమానాల మధ్య...
మామూలుగా అయితే ధోని ఫామ్ పై అనేక అనుమానాలున్నాయి. అనేక రోజులు విశ్రాంతి తీసుకోవడం, కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జట్టుకు పెద్దన్నగానే వ్యవహరిస్తారని భావించారు. అసలు ఆడతాడా? లేదా? అన్న అనుమానం కూడా కలిగింది. జట్టుకు మెంటర్ గా ఉంటాడని అందరూ అంచనాలు వేశారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ధోనీ కీపింగ్ ప్యాడ్స్ తో బరిలోకి రాగానే అందరికీ అర్థమయిపోయింది. ధోనీ ఈ వయసులోనూ ఆట వదులుకోడని. కీపింగ్ ను అవతలి వ్యక్తికి అప్పగించి తప్పుచేయడని. అదే నిజమయింది
నిన్నటి మ్యాచ్ లో...
నిన్న జరిగిన మ్యాచ్ లో ముస్తాఫిజర్ బౌలింగ్ లో రజిత్ పటీదార్ ఇచ్చిన క్యాచ్ ను చిరుతలా పట్టేశాడు. అంతే కాదు దీపక్ చాహర్ వేసిన బంతిని మ్యాక్ వెల్ ఆఫ్ సైడ్ కొట్టగానే తనకు అందనంత దూరంలో ఉన్న బంతిని పట్టేసి ఔరా అని అనిపించుకున్నారు. ఇక అనుజ్ రావత్ ను రన్ అవుట్ చేసిన తీరుతో ధోనీపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయి పోయాయి. ఈ ధోనీయేనా? టీం ఇండియా నుంచి తప్పుకుంది.. జట్టులోకి మళ్లీ వస్తే ఎంత బాగుండు? అని అనుకున్న వారు లేరంటే అతిశయోక్తి కాదు. అదీ ధోనీ సత్తా.. శక్తి.. అందుకే మహేంద్రుడంటే అందరికీ అభిమానం.
Next Story