Sun Dec 22 2024 22:21:27 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : గుజరాత్ కు మాత్రం డూ ఆర్ డై
ఈరోజు కోల్కత్తా నైట్ రైడర్స్ తో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగనుంది
ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ కు ఇప్పటికే కోల్కత్తా నైట్ రైడర్స్ చేరుకుంది. మిగిలిన జట్లు ప్లే ఆఫ్ లో ఉండేందుకు పోటీ పడుతున్నాయి. అన్ని జట్లు అలాగే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ప్రధమ స్థానంలో కోల్కత్తా నైట్ రైడర్స్ ఉండగా, తర్వాత స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్, బెంగళూరు జట్లు ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, గుజరాత్ లు కూడా ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలని చెమటోడుస్తున్నాయి.
వరస ఓటములతో...
ఈరోజు కోల్కత్తా నైట్ రైడర్స్ తో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే కోల్కత్తా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. గుజరాత్ టైటాన్స్ వరస ఓటములతో ఇబ్బంది పడుతుంది. పాయింట్ల పట్టికలో కూడా కిందిస్థాయిలో ఉ:ది. ఇప్పటి వరకూ గుజరాత్ టైటాన్స్ పన్నెండు మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఏడు మ్యాచ్ లు ఓడి పది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ గెలవాల్సి ఉంటుంది.
Next Story