Mon Dec 23 2024 02:42:39 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : టైటాన్స్ బలహీన పడటానికి కారణమేంటి? ఢిల్లీ పుంజుకోవడానికి రీజన్ ఏంటి?
సొంతగడ్డ అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ కాపిటల్స్ చేతిలో దారుణంగా ఓటమి పాలయింది
ఐపీఎల్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంది వచ్చిన అవకాశాలను పుచ్చుకుంటూ వస్తే సరి. లేదంటే అట్టడుగుకు వెళ్లిపోయిన జట్లను చూశాం. వన్డే వరల్డ్ కప్ లో అన్ని జట్లను ఓడించి కాలరెగరేసిన టీం ఇండియా చివరకు ఫైనల్స్ లో చేతులెత్తేసిన సంగతినీ మనం మరచిపోలేం. ఇప్పుడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ పరిస్థితి అలాగే ఉంది. గత నెల 22వ తేదీన ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి గుజరాత్ టైటాన్స్ దూకుడు ప్రదర్శించింది. అయితే రాను రాను జట్టు బలహీనంగా మారుతున్నట్లు కనిపిస్తుంది. అంచనాలు కూడా అందకుండా పూర్తిగా ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఫలితంగా టైటాన్స్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తున్నారు.
వరస ఓటములతో....
నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఇదే సంగతి చెబుతుంది. సొంతగడ్డ అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ ఖచ్చితంగా గెలుస్తుందని భావించారు. కానీ చివరకు అట్టడుగు స్థాయి పడిపోయింది. ఎవరూ ఊహించని స్కోరుకు ఆల్ అవుట్ అయి తమ పని అయిపోయిందా? అన్నట్లు బేల చూపులు చూడటం కనిపించింది. వరసగా గుజరాత్ టైటాన్స్ నాలుగో ఓటమిని చవి చూసింది. సొంత మైదానంలో కూడా చతికలపడింది. గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ చప్పగానే సాగింది. ఎందుకంటే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ను ఢిల్లీ బౌలర్లు దారుణంగా దెబ్బతీశారు. వరస బెట్టి వికెట్లు తీస్తూ పరుగులు అనేది లేకుండా చేశారు. శుభమన్ గిల్, సాహా, సుదర్శన్, మిల్లర్, అభినవ్, తెవాతియా ఇలా వరస బెట్టి అవుట్ కావడంతో ఢిల్లీ స్కోరు 17.3 ఓవర్లకే ఆల్ అవుట్ అయి 89 పరుగులు మాత్రమే చేసింది.
చిన్న స్కోరును...
ఇది ఢిల్లీ జట్టుకు పెద్ద స్కోరు కాదు. ఐపీఎల్ లో ఇంత తక్కువ స్కోరు అవతల జట్టు ఏదైనా సునాయసంగా అధిగమించేస్తుంది. ఢిల్లీ జట్టులో ఖలీల్ ఒకటి, ఇషాంత్ శర్మ రెండు, ముకేశ్ కుమార్ మూడు, స్టబ్స్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసి టైటాన్స్ ను మట్టికరిపించారు. ఇక 90 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ జట్టుకు పది ఓవర్లు కూడా అవసరం లేకుండా పోయాయి. పృథ్వీ షా ఏడు పరుగులకే అవుటయినా జేక్ ఫ్రేజర్ 20, పంత్ , సుమిత్ లు కలసి చిన్న స్కోరును ఛేదించారు. 8.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి విజయం సాధించారు. దీంతో గుజరాత్ టైటాన్స్ కు వరసగా నాలుగో పరాజయం దక్కినట్లయింది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ గుజరాత్ కంటే ఎగబాకి పై స్థానంలో నిలిచింది.
Next Story