Wed Jan 15 2025 09:39:01 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేటి కీలక మ్యాచ్ కు వాన గండం
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మరికాసేపట్లో హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కానుంది
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మరికాసేపట్లో హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ తో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తలపడనుంది. ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేసిన ఫ్యాన్స్ స్టేడియానికి చేరకున్నారు. ఉప్పల్ స్టేడియంను కవర్లతో కప్పేశారు. మరో రెండు గంటల పాటు హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉండటంతో మ్యాచ్ జరడంపై అనుమానాలు కలుగుతున్నాయి. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు.
వర్షం పడితే మాత్రం...
వర్షం ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టినా మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐదు రోజుల పాటు వర్షాలు హైదరాబాద్ ను ముంచెత్తుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ జరగడం అనుమానంగానే ఉంది. మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోతే చెరొక పాయింట్ ఇరుజట్లకు లభిస్తుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ కు చేరకునే అవకాశాలున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నది రాత్రి 7.30 గంటలకు కానీ తెలియదు.
Next Story