Fri Dec 20 2024 19:43:21 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఎవడ్రా మమ్మల్ని ఆపేది.. ప్లేఆఫ్ కు చేరేది మేమేరా
కోల్కత్తా నైట్ రైడర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లోనూ కేకేఆర్ దే విజయం అయింది.
ఈ ఐపీఎల్ సీజన్ లో అస్సలు ఊహించని జట్లు ప్లేఆఫ్ కు చేరుకునేందుకు ఇప్పటికే బెర్త్‌లు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఫైనల్స్ కు చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ పై భారీగా అంచనాలు వినిపించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఈసారైనా ఛాంపియన్ అవుతుందని అందరూ భావించారు. ఎందుకంటే మంచి ఫామ్ లో కొనసాగుతుండటంతో ఈ జట్లే ఫైనల్స్ కు చేరుకుంటాయని అంచనాలు బాగా వినిపించాయి. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం అంచనాలకు భిన్నంగా జరుగుతున్నాయి. అసలు ఊహించని జట్లు ఫైనల్స్ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్లే ఆఫ్ బెర్త్ కోసం...
ఇంకా ప్లేఆఫ్ కోసం అన్ని జట్లు ప్రయత్నిస్తున్నాయి. శ్రమిస్తున్నాయి. కానీ అందులో రాజస్థాన్ రాయల్స్ టాప్ పొజిషన్ లో ఉండగా, దానిని నెట్టి కోల్కత్తా నైట్ రైడర్స్ మొదటి స్థానంలోకి చేరింది. ఈ రెండు జట్లపై పెద్దగా మొదట్లో అంచనాలు లేకపోయినా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని ముందుకు సాగుతున్నాయి. నిన్న జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లోనూ కేకేఆర్ దే విజయం అయింది. వరస విజయాలతో కేకేఆర్ దూసుకుపోతుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు ఊహించినట్లుగానే భారీ స్కోరు చేసింది. ఎనిమిదో విజయాన్ని సాధించి పదహారు పాయింట్లు సాధించింది. ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయమయింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి పడిపోయింది. కేకేఆర్ దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకున్నట్లే.
భారీ పరుగుల తేడాతో...
ముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఓపెనర్లు దుమ్ము దులిపేశారు. సాల్ట్ ఉన్నంత సేపు స్కోరు బోర్డు వేగంగా పరుగులు తీసింది. అయితే 32 పరుగుల వద్ద అవుటయినా నరేన్ మైదానాన్ని వదలకుండా వరస సిక్సర్లు బాదుతూ 81 పరుగులు చేశాడు. నరేన్ కు తోడు రఘువంశీ అండగా నిలిచాడు. రఘువంశీ 32 పరుగులు చేశాడు. రింకూ సింగ్ పదహారు, శ్రేయస్ అయ్యర్ 23 పరుగులు చేసి 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేశారు. ఇది లక్నో సూపర్ జెయింట్స్ కు భారీ స్కోరు అనే చెప్పాలి. ఎందుకంటే అంతటి స్కోరును ఛేదనలో దాటడం అంత సులువు కాదు. కెఎల్ రాహుల్ 25 పరుగుల చేసి అవుటయ్యాడు. అర్షిన్ కులకర్ణి 9 పరుగులకే వెనుదిరిగాడు. దీపక్ హుడా ఐదుపరుగులు, పూరన్ పది పరుగులకే అవుట్ కావడంతో ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి ఖాయమింది. ఎవరూ కోల్కత్తా నైట్ రైడర్స్ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయారు. విలవిలలాడిపోయారు. కేవలం 16. 1 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి 137 పరుగులు మాత్రమే లక్నో సూపర్ జెయింట్స్ చేయగలిగింది. 98 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Next Story