Sat Dec 21 2024 10:54:20 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఒక్కడు క్లిక్ అయితే చాలు.. మ్యాచ్ మన చేతికి వచ్చినట్లే.. కీలక సమయంలో కావాలిగా
లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వన్ సైడ్ గానే జరిగింది.
ఐపీఎల్లో మ్యాజిక్ లకు మాత్రమే చోటుంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నపళంగా అంచనాలు లేని ప్లేయర్లు ఇరగదీసి ఆడతారు. అంచనాలు అధికంగా ఉన్న ఆటగాళ్లు డకౌట్లు అయి నిరాశపరుస్తారు. ఎంత స్కోరు చేశామని కాదు.. ఎన్ని వికెట్ల పడగొట్టామన్నది కూడా ఐపీఎల్ లో ముఖ్యమేనంటారు. అందుకే ప్రతి బంతి ఆచితూచి వేయాలి బౌలర్. అలాగే బ్యాటర్ కూడా ప్రతి బంతికి రన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఐపీఎల్ లో ఎన్నో విశేశాలు నిత్యం చూస్తూనే ఉంటాయి. ఊపు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ ను ఢిల్లీ కాపిటల్స్ జట్టు అలవోకగా ఓడించింది. అదీ కులదీప్ యాదవ్ మాయాజాలంతోనే అది సాధ్యమయింది.
అలవోకగానే...
నిన్న జరిగిన లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వన్ సైడ్ గానే జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అలవోకగా గెలిచింది. ఢిల్లీలో సమిష్టిగా రాణించడంతో ఈ విజయం దక్కింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆదిలోనే కీలకమైన వికెట్లన్నింటినీ కోల్పోయింది. డీకాక్ 19, కేఎల్ రాహుల్ 39 పరుగులు చేసి అవుటయ్యారు. పడిక్కల్, స్టయినస్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. పురన్ డకౌట్ అయ్యాడు. మూడు వికెట్లు తీసి కులదీప్ యాదవ్ లక్నో లో కీలక వికెట్లు తీయగలిగాడు. కేఎల్ రాహుల్, స్టాయినిస్, పూరన్ వంటి కీలక వికెట్లు సరైన సమయంలో తీసి కులదీప్ యాదవ్ జట్టుకు వెన్నుదన్నుగా నిలిచాడు.
అందరూ రాణించడంతో...
ఢిల్లీ కాపిటల్స్ లో ఖలీల్ మరో రెండు వికెట్లు తీశాడు. పదమూడు ఓవర్లకు వంద కూడా దాటని స్కోరును బదోని, అర్హద్ నిలబడి ఆడి ఆ మాత్రం స్కోరు చేయగలిగారు. చివరి ఐదు ఓవర్లలో సిక్సర్లు, ఫోర్లు బాదడంతో ఏడు వికెట్లు కోల్పోయి లక్నో సూపర్ జెయింట్స్ 167 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు ఆదిలోనే వార్నర్ వికెట్ పడటంతో కొంత ఆశలు చిగురించినా, పృథ్వీషా, జేక్ ప్రేజర్ నిలబడి స్కోరును పరుగులు పెట్టించాడు. కొత్త కుర్రాడు అయినా జేక్ ఫ్రేజర్ సిక్సర్లు, ఫోర్లు బాది 55 పరుగులు చేశాడు. పృథ్వీ షా 32 పరుగులు చేశాడు. తర్వాత పంత్ 41 పరుగులు చేసి జట్టు విజయం ఖాయమనిపించినా, చివరలో వచ్చిన స్టబ్స్, హోప్ ఆ మిగిలిన పరుగులు పూర్తి చేసి ఢిల్లీ కాపిటల్స్ కు విక్టరీని అందించారు.
Next Story