Sun Nov 17 2024 13:50:31 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : పాపం లక్నో.. కలసి రాలేదంతే... దూసుకొచ్చినా లక్ దాని దరిచేరకపోవడంతో ప్లేఆఫ్ రేసు నుంచి?
ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచింది
కొన్ని జట్లు అంతే. తొలి నుంచి నిలకడగా ఆడుతూ విజయాలు సొంతం చేసుకుంటూ ఖచ్చితంగా ప్లే ఆఫ్ కు చేరుతుందని భావించిన జట్లు అవి ఇంటి దారి పట్టాయి. అందులో లక్నో సూపర్ జెయింట్స్ ఒకటి. లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది. అప్పుడప్పుడూ ఓటములను పలకరించినా ఎక్కువ విజయాలను సొంతం చేసుకుంది. ప్లేఆఫ్ లో దాని మ్యాచ్ లన్నీ ముగిసే సమయానికి పథ్నాలుగు పాయింట్లకు చేరుకుంది. అంటే లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్ రేసు నుంచి అది తప్పుకున్నట్లే. తొలి నుంచి మంచి అంచనాలతో కనిపించి, ఫామ్ లో ఉన్న జట్టుగా అందరూ భావించినా లక్ మాత్రం దానికి కలసి రాలేదంతే.
ప్లే ఆఫ్ రేసు నుంచి...
నిన్న ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచింది. కానీ ప్లే ఆఫ్ రేసు నుంచి పక్కకు తప్పుకుంది. గెలిచినా నిలవలేకపోవడానికి మధ్యలో అనుకోని విధంగా ఓటములు పాలు కావడంతో అది ఆశించిన పాయింట్లను సాధించలేకపోయింది. లేకుంటే రాజస్థాన్ రాయల్స్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా పాయింట్ల పట్టికలో దూసుకు వచ్చేది. కానీ కాలం కలసి రాలేదు. జట్టు సమిష్టి విజయంతో అనేక సార్లు రాణించి ఏడు విజయాలను సాధించి పథ్నాలుగు పాయింట్లను సాధించింది. అయినా సరే.. ప్లే ఆఫ్ రేసు నుంచి అది నిష్క్రమించాల్సి వచ్చింది. దీనికి ఎవరినీ నిందించి లాభం లేదు. నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ అంటూ నిట్టూర్చాల్సిందే.
అత్యధిక స్కోరు చేసి...
నిన్న ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మంచి పెర్ఫార్మెన్స్ తో ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టులో పూరన్‌కు పూనకాలు వచ్చేశాయి. పూరన్ 75 పరుగులు చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 55 పరుగులు చేశాడు. ఇరవై ఓవర్లకు గాను ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఆరు వికెట్లు కోల్పోయి 214 పరుగుల చేసింది. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ముంబయి ఇండియన్స్ చివరి ఆటను గెలుపుతో ముగించాలనుకుంది. లక్ష్య సాధనలో బరిలోకి దిగిన ఆ జట్టుకు ఆరంభంలో మంచి ఫామ్ లో ఉన్నట్లే కనిపించింది. రోహిత్ శర్మ 68 పరుగులు చేశాడు. బ్రెవిస్ 23 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ మళ్లీ నిరాశ పర్చి డకౌట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా 16 పరుగుల వద్ద అవుటయ్యాడు. నమన్ నాటౌట్ గా నిలిచి 62 పరుగులు చేశాడు. ఇరవై ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. సొంత మైదానంలో చివరి ఓటమిని కూడా మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం గెలచి ప్లే ఆఫ్ రేసు నుంచి పక్కకు తప్పుకుంది.
Next Story