Sun Nov 17 2024 13:41:58 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : షాకింగ్ న్యూస్ ... ఇది నిజమా? కెప్టెన్గానేనా? లేక జట్టు నుంచి తప్పుకున్నాడా?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ కు జట్టు యాజమాన్యం అప్పగించింది. మహేంద్ర సింగ్ థోని ఇలా హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్న దానిపై ధోని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కు ధోని కెప్టెన్సీగా ఉంటూ ఐదు సార్లు జట్టుకు విజయాన్ని అందించాడు. గత సీజన్ ఆఖరుది అని ప్రచారం జరిగినా తాను వచ్చే సీజన్ లోనూ ఆడతానని ధోనీ ప్రకటించడంతో మహేంద్రుడి అభిమానులు ఆనందపడ్డారు. ధోనీ సారధ్యంలో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ కప్ గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.
గైక్వాడ్ ను కెప్టెన్ గా...
అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అని జట్టు యాజమాన్యం ప్రకటించడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఈరోజు ఐపీఎల్ ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు ఫొటో షూట్ లో పాల్గొన్నారు. కానీ ఫొటో షూట్ కు ధోనీ హాజరు కాలేదు. రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే హాజరు కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ధోనీ అంటే దేశంలోనే కాదు ప్రపంచలోనే ఎందరో అభిమానులను సంపాదించుకున్న కెప్టెన్ గా పేరుంది. కీపింగ్ విషయంలోనూ ధోనీ స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. వికెట్ల వెనక వేగం అలాగే ఉంది.
జట్టును గెలిపించే...
అన్ని ఫార్మాట్లలో రిటైర్ మెంట్ ప్రకటించినా తమకు ఐపీఎల్ లో ధోనీ కనపిడితే చాలు ఫ్యాన్స్ ఊగిపోతారు. అలాంటి ధోనీ ఉన్నట్లుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ధోనీ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమా? లేక జట్టు యాజమాన్యం అతనిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిందా? అన్న అనుమానాలు అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. రేపు ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండటం ఒకరోజు ముందు ఈ వార్త తెలియడంతో ధోనీ ఫ్యాన్స్ ఇది నిజమా? అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. 2019 సీజన్ లో సీఎస్కేలోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ధోని కెప్టెన్ గానే తప్పుకున్నాడా? లేక జట్టునుంచి వైదొలిగాడా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Next Story