Mon Dec 23 2024 04:36:25 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : కసి అంటే ఈ జట్టుదే మరి.. లక్ ను నమ్ముకోకుండా పెర్ఫార్మెన్స్ను నమ్ముకుంటూ
ఢిల్లీ కాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.
ఢిల్లీ కాపిటల్స్ జట్టు పుంజుకుంది. ఓటముల నుంచి తేరుకుంది. తిరిగి విజయాలను అందుకుంటూ పాయింట్ల పట్టికలో ముందుకు వెళుతుంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా పెర్ఫార్మెన్స్ చూపిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బౌన్స్ బ్యాక్ అయి ఈ జట్టు ప్లే ఆఫ్ కు చేరేందుకు ప్రయత్నిస్తుంది. కేవలం అదృష్టాన్ని నమ్ముకోలేదు. జట్టు కసి మీదుంది. ఎలాగైనా తమ జట్టు మీదున్న ఆ బ్యాడ్ నేమ్ ను తొలగించుకోవాలన్న పట్టుదల జట్టులోని ప్రతి సభ్యుడిలో కనిపిస్తుంది. అందుకే సమిష్టి కృషితో రాణిస్తుంది. సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ వంటి మెంటర్లు దాని వెనక ఉండటం కూడా కలసి వచ్చే అంశంగా చెప్పాలి.
పంత్.. పటేల్...
నిన్న జరిగిన ఢిల్లీ కాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు ఢిల్లీ కాపిటల్స్ దే విజయాన్ని వరించింది. నాలుగు పరుగుల తేడాతోనే విక్టరీ కొట్టేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కాపిటల్స్ ఆదిలో ముఖ్యమైన వికెట్లను కోల్పోయింది. అయితే కెప్టెన్ రిషబ్ పంత్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లు నిలబడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఒక దశలో 150 పరుగులు కూడా అసాధ్యమనుకుంటే.. ఇద్దరూ కలసి సిక్సర్లు, బౌండరీలు బాదుతూ ఢిల్లీ కాపిటల్స్ స్కోరును 224 పరుగులు చేసింది. పృధ్వీషా, జేక్ ప్రెజర్, హోప్ అవుట్ కావడంతో తక్కువ స్కోరు చేస్తుందని భావించారు. కానీ అక్షర్ పటేల్ 66 పరుగులు, పంత్ 88 పరుగులు చేయడంతో పాటుగా స్టబ్స్ కూడా చివరిలో వచ్చి 26 పరుగులు జోడించి అత్యధిక పరుగులు తెచ్చి పెట్టాడు.
సాయి.. మిల్లర్ కూడా...
అయితే గుజరాత్ టైటాన్స్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఎందుకంటే ఆ జట్టులోనూ మంచి హిట్టర్లున్నారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు సాహా మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. సాహా 39 పరుగులు చేశాడు. శుభమన్ గిల్ మాత్రం ఆరు పరుగులకే అవుటయ్యాడు. సాయి సుదర్శన్ 65 పరుగులు చేశాడు. మిల్లర్ 55 పరుగులు చేశాడు. ఒక దశలో గుజరాత్ టైటాన్స్ గెలిచేటట్లే కనిపించింది. కానీ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 220 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఓటమి తప్పలేదు. చివర వరకూ ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగి క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించింది. మొత్తం మీద గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలయినా మంచి పెర్ఫార్మెన్స్ చూపిందంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
Next Story