Mon Dec 23 2024 07:33:27 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : చివరి బంతికి కావాల్సింది ఐదు పరుగులు... ఊపిరి ఆగిపోతుందనేలా?
కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య /జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది
ఐపీఎల్ అంటే అంతే మరి. మజా మామూలుగా ఉండదు. చివరి బంతి వరకూ ఉత్కంఠ నెలకొంటుంది. నరాలు తెగిపోయే టెన్షన్ చూసే వారికి. అందుకే ఐపీఎల్ కు అంతటి ఆదరణ. ఏ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. చిన్నదైనా.. పెద్దదైనా.. తక్కువ స్కోరు అయినా.. భారీ స్కోరు అయినా సరే... జట్లు ఆచితూచి ఆడాల్సిందే. మైదానంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇలాంటి వాతావరణమే మరోసారి కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ నిన్న జరిగింది. అభిమానుల ఊపిరిని క్షణం పాటు ఆపేసింది.
ధనాధన్ బ్యాటింగ్...
తొలుత కోల్కత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేసింది. అయితే ఈ సీజన్ లో తొలిసారి రెండు వందల పరుగుల స్కోరు బోర్డు దాటించేసింది. 208 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ ముందు ఉంచింది. కోల్కత్తా నైట్ రైడర్స్ లో రస్పెల్ రఫ్ఫాడించాడు. ఏడు సిక్సర్లతో స్టేడియంలో మోత పుట్టించాడు. కేవలం 25 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఏడు సిక్సర్లు అంటే మామూలు విషయం కాదు. రస్సెల్ ను చాలా రోజుల తరవాత అతని ఆటను చూశాం. మజా చేశారు. మిగిలిన వారంతా తక్కువ స్కోరుకకే అవుటయినప్పటికీ సాల్ట్, రస్సెల్, రింకూ సింగ్ లు మాత్రమే ఆటలో రాణించి జట్టుకు అంతటి భారీ స్కోరును సంపాదించి పెట్టారు.
హైదరాబాద్ కూడా...
తర్వాత భారీ స్కోరు లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ లక్ష్యాన్ని సాధించేందుకు చివరి వరకూ పోరాడింది. అవుటయ్యే వారు అవుట్ అవుతున్నా నిలదొక్కుకుని స్కోరు బోర్డును పరుగులు తీయంచింది. చివరి నాలుగు ఓవర్లలో 76 పరుగుల చేయాలి. భారీ లక్ష్యమే. అయితే క్లాసెన్ సిక్సర్లతో చెలరేగిపోవడంతో స్కోరు చిన్నదైపోయింది. వరణ్ కూడా సిక్సర్ బాదడంతో చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా ఆ బంతికి కేవలం ఒకే పరుగు రావడంతో నాలుగు పరుగుల తేడాతో కోల్కత్తా నైట్ రైడర్స్ కు విజయం దక్కింది. స్టేడియంలో ఉగ్గబట్టి చూస్తున్న నైట్ రైడర్స్ అభిమానులకు చివరి బంతికి కేవలం ఒక్క పరుగు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Next Story