Fri Dec 20 2024 05:55:35 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ముంబయికి కలసి రావడం లేదు.. ఈ ఓటములేందమ్మా?
ముంబయి ఇండియన్స్ ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది.
ఐపీఎల్ లో బ్యాట్ తో పాటు ఫేట్ కూడా అంతే ముఖ్యం. బ్యాట్ ఎంత ఝుళిపించినా అదృష్టం కలసిరాకపోతే.. ఆఖరి నిమిషంలో అదృష్టం ముఖం చాటేస్తుంది. ముంబయి ఇండియన్స్ పరిస్థితి ఇలాగే ఉంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి కూడా ముంబియి ఇండియన్స్ పరిస్థితి ఇలాగే ఉందని చెప్పాలి. ఎందుకంటే ముంబయి ఇండియన్స్ అనేక సార్లు ఛాంపియన్ గా నిలిచి సత్తా చాటింది. బంతులను బాదే హిట్టర్లతో పాటు వేగంగా సూటిగా విసిరే బౌలర్లు కూడా దాని సొంతం. కానీ పాపం ఎందుకో ఈ సీజన్ మాత్రం ముంబయి ఇండియన్స్ కు కలసి రావడం లేదనే చెప్పాలి. అందుకే చేతికి వచ్చిన ఓటమి ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది.
దూకుడుగా ఆడి...
ముంబయి ఇండియన్స్ ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేసింది. మొదట్లో కొంత తడబడినా ఢిల్లీ కాపిటల్స్ జట్టు తేరుకుంది. ముంబయి ఇండియన్స్ పై కూడా అత్యధిక స్కోరును నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కాపిటల్స్ లో జేక్ ఫ్రేజర్ రెచ్చి పోయి ఆడాడు. 84 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ 36 పరుగులు చేశాడు. హోప్ 41 పరుగులు చేశాడు, పంత్ 29 పరుగులకు అవుటయినప్పటికీ స్బబ్స్ మరోసారి విజృంభించి కీలక సమయంలో 48 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లలో ఢిల్లీ కాపిటల్స్ 257 పరుగుల చేసి ముంబయి ఇండియన్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఓపెనర్లు ఎప్పటిలాగానే...
తర్వాత బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ ఎప్పటిలాగానే ఓపెనర్లు ఇబ్బందిపడ్డారు. ఇషాన్ కిషన్ ఇరవై పరుగులు చేసి అవుటవ్వగా, రోహిత్ శర్మ ఎనిమిది పరుగులకే అవుటయి నిరాశపర్చాడు. సూర్యకుమార్ 26 పరుగులు చేస్తూ పరవాలేదనిపించినా అవుట్ కావడంతో కీలకమైన మూడు వికెట్లు కోల్పోయాయి. అయితే తెలుగు కుర్రోడు తిలక్ వర్మ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 63 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. హార్ధిక్ పటేల్ కాసేపు క్రీజులో ఉన్నా సిక్సర్లు, ఫోర్లతో హడలెత్తించాడు. చివరకు 46 పరుగులకు అవుటయ్యాడు. వధేరా కూడా 46 పరుగులు చేసి అవుట్ కావడంతో మిగిలిన బ్యాటర్లు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది. పది పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది.
Next Story