Sun Dec 22 2024 22:32:05 GMT+0000 (Coordinated Universal Time)
Mitchell Starc : ట్రోలింగ్ చేసినా నేను పట్టించుకోలేదు.. నా పని నేను చేసుకెళ్లా
కోల్కత్తా నైట్ రైడర్స్ ఫైనల్స్ లో విజయం సాధించి ఛాంపియన్ గా అవతరించడానికి కారణం మెచెల్ స్టార్క్ అనే చెప్పాలి
కోల్కత్తా నైట్ రైడర్స్ ఫైనల్స్ లో విజయం సాధించి ఛాంపియన్ గా అవతరించడానికి కారణం మెచెల్ స్టార్క్ అనే చెప్పాలి. అభిషేక్ శర్మను తొలి ఓవర్ లోనే పెవిలియన్ బాట పట్టించి ఆ జట్టుపై వత్తిడి పెంచాడు. తర్వాత మరో వికెట్ తీసి తనకు నాకౌట దశలో తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఫైనల్స్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న మెచెల్ స్టార్క్ తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ పైన కూడా స్పందించాడు. ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ మెచెల్ స్టార్క్ ను 24.75 కోట్ల అత్యధిక ధరను వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే లీగ్ మ్యాచ్ లో ఎక్కువ పరుగులు ఇవ్వడం చూసిన అనేక మంది ఇతనికా.. ఇన్ని కోట్లు కుమ్మరించింది అంటూ సెటైర్లు వేశారు.
అన్ని కోట్లు తీసుకుని...
లీగ్ మ్యాచ్ లలో పన్నెండు వికెట్లు మాత్రమే అతను పడగొట్టగలిగాడు. మెచెల్ స్టార్క్ ఓపెనర్ బౌలర్ గా కోల్కత్తా నైట్ రైడర్స్ వినియోగించుకున్నప్పుడల్లా విఫలమవుతూనే కనిపించాడు. దీంతో మెచెల్ స్టార్క్ పై పెద్దయెత్తున విమర్శలు వినిపించాయి. అయిేత నాకౌట్ దశలో మాత్రం రెండు మ్యాచ్ లలో ఐదు కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థులను వణికించాడు. తనపై వచ్చిన ట్రోల్స్ ను చూసి పెద్దగా బాధపడలేదని, అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకుంటానన్న ధీమాతో ముందుకు వెళ్లానని ఆయన తెలిపాడు. మెచెల్ స్టార్క్ తొలి క్వాలిఫయిర్ లో మూడు వికెట్లు తీశాడు. ఫైనల్స్ లో రెండు వికెట్లు తీసి శభాష్ అని అనిపించుకున్నారు. తిట్టిన నోళ్లే ప్రశంసిస్తుండటాన్ని చూస్తుంటే అంత కంటే ఏంకావాలి? అని మెచెల్ స్టార్క్ ప్రశ్నించాడు.
Next Story