Fri Dec 20 2024 06:24:10 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : గెలిచినా వేస్ట్.. కానీ ఆట మాత్రం?
ఈరోజు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరుగుతుంది.
ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కు చేరుకునే మూడు జట్ల ఏంటన్న దానిపై స్పష్టత వచ్చింది. నాలుగో ప్లేస్ కోసం మిగిలిన జట్లు ఇప్పడు శ్రమిస్తున్నాయి. కేవలం ఆట మాత్రమే కాదు. అదృష్టం కూడా కలసి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వాన రాకూడదు. వాన వచ్చి మ్యాచ్ రద్దయితే కొన్ని జట్లు ఆటోమేటిక్ గా ప్లేఆఫ్ కు చేరుకుంటాయి. మరికొన్ని జట్లు సీజన్ ఆరంభంలో జూలు విదిలించి ఆడినా.. ముగింపు నాటికి చేతులెత్తేసి ఆకాశం వైపు చూస్తున్నాయి. ఈ సీజన్ అంతా దాదాపు అలాగే సాగింది. అందుకే ఐపీఎల్ లో అంచనాలు ఏవీ అందకుండా ముందుకు సాగుతుండటంతోనే ఈ ఆట హిట్ అయింది. అభిమానులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు.
నేడు ఐపీఎల్ లో...
ఈరోజు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరుగుతుంది. ముంబయి వేదికగా రాత్రి 7.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ లో ముంబయికి గెలిచినా ఉపయోగం లేదు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ కూడా అంతే. రెండు జట్లలో ముంబయి ఇండియన్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ కు ఉన్న కొద్దిపాటి అవకాశాలు కూడా అంతంత మాత్రమే. అది కూడా ఆటతో పాటు అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ రెండు జట్లలో ఎవరికి విజయం లభించినా పెద్దగా ఉపయోగం లేని మ్యాచ్ గానే చూడాల్సి ఉంటుంది. అయినా మ్యాచ్ గెలిచేందుకు రెండు జట్లు తలపడతాయి. మంచి క్రికెట్ చూడొచ్చు.
Next Story