Mon Dec 23 2024 02:34:42 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : పాండ్యాను ఏకిపారేస్తున్న నెటిజన్లు...ఓటమికి నువ్వే కారణమంటూ
గుజరాత్ టైటాన్స్ తో ఓటమి పాలయిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు
అంతే... సమిష్టి శ్రమతో గుజరాత్ టైటాన్స్ ను ఒకసారి కప్ సాధించి, మరొక సీజన్ లో ఫైనల్స్ కు తెచ్చిన హార్ఢిక్ పాండ్యా జట్టు మారి తొలి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్పప్పటికీ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతారని భావించిన ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లోనే తప్పటడుగు వేసింది. ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఆసక్తికరంగానే సాగినప్పటికీ చివరకు టైటాన్స్ నే విజయం వరించింది. అయితే విజయం ఎవరిదైనా తప్పు మాత్రం హార్థిక్ పాండ్యా మీదనే నెడుతూ అనేక మంది కామెంట్స్ పెడుతున్నారు. తీవ్ర స్థాయిలో పాండ్యా విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఆరు పరుగుల తేడాతో...
గుజరాత్ టైటాన్స్ ముంబయి ఇండియన్స్ పై ఆరు పరుగుల తేడాతో్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది. ఐపీఎల్ లో ఇది తక్కువ స్కోరు. ఈ లక్ష్యాన్ని సాధించడం ముంబయి ఇండియన్స్ కు పెద్ద కష్టమేమీ కాదు. ముంబయి ఇండియన్స్ లో మరోసారి బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మూడు వికెట్లు పడగొట్టి టైటాన్స్ ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. శుభమన్ గిల్ 31 పరుగుల చేసి కెప్టెన్ గా తనలో ఏ మాత్రం పస తగ్గలేదని నిరూపించాడు. తొమ్మిది వికెట్లు కోల్పోయి గుజరాత్ టైటాన్స్ కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది.
రోహిత్ హిట్ అయినా...
అయితే లక్ష్యసాధనలో ముంబయి ఇండియన్స్ కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది. తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది. రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ లో అత్యధికంగా 43 పరుగులు చేశాడు. బ్రెవిస్ 46 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నప్పుడు ముంబయి ఇండియన్స్ దే గెలుపు అని అందరూ భావించినా అజ్మతుల్లా, మోహిత్ శర్మ, స్సెన్సర్ జాన్సన్, ఉమేశ్ తలో రెండు వికెట్లు పడగొట్టి ముంబయిని మట్టికరిపించారు. ముంబయి జట్లు మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయినా తర్వాత నిలదొక్కుకుని ఆడినాచివరకు ఫలితం దక్కలేదు. ఈ ఓటమి పాండ్యా ఖాతాలోనే నెటిజన్లు వేస్తున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించి పాండ్యా తాను బాధ్యతలను తీసుకోవడంతో విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Next Story