Sun Nov 17 2024 17:47:21 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈ శుభఘడియల కోసమే కదా ఎదురు చూపులు
ముంబయి ఇండియన్స్ తొలి విజయం సాధించింది. సొంత మైదానంలో ఈ సీజన్ లో తొలిసారి గెలిచింది. జట్టు యజమాని నీతూ అంబానీ నవ్వింది.
ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. సొంత మైదానంలో ఈ సీజన్ లో తొలిసారి గెలిచింది. ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈ జట్టు తొలి సారి గెలవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీ కాపిటల్స్ పై 29 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. దీంతో ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ముంబయి జట్టుకు ఈ గెలుపు ఒక ఊపిరి పోసిందనే చెప్పాలి. అందరూ రాణించారు. సమిష్టిగా పెర్ఫెర్మెన్స్ చేయడంతోనే జట్టుకు విజయం సాధ్యమయింది.
లేచి నిలబడి మరీ...
దీంతో జట్టు యజమాని నీతూ అంబానీ నవ్వింది. చివరి ఓవర్ కు నీతూ అంబానీ లేచి నిలబడి మరీ ఇక జట్టు గెలుస్తుందన్న ఆనందంతో కేరింతలు కొట్టారు. చప్పట్లతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇన్నాళ్లూ వరస ఓటములతో నీతూ అంబానీ ముఖం స్టేడియంలో నవ్వు ఉండేది కాదు. ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ చేసేటప్పుడు కానీ, బౌలింగ్ సమయంలోనూ ఆమె నిర్వికారంగా కూర్చునే వారు. ఓటమి తప్పదన్న నిరాశతో ఆమె స్టేడియంలో కనిపించే వారు. కానీ ఈసారి తొలిసారి గెలవడంతో నీతూ అంబానీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..
29 పరుగుల తేడాతో...
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు 234 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి స్పెల్ లో కొంత ముంబయి టీం కు ఢిల్లీ క్యాపిటల్స్ దడ పుట్టించింది. అంత పెద్ద స్కోరును ఒక్క పృధ్వీ షా ఉంటే చాలు ఛేజ్ చేయడం ఈజీ అన్న రీతిలో అంచనాలు కనిపించాయి. కానీ షా అవుట్ కావడంతోనే వరస బెట్టి.. అవుట్ అయ్యారు. స్టబ్స్ చేసిన 71 పరుగులు వేస్ట్ అయ్యాయి. ఢిల్లీ కాపిటల్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. దీంతో నీతూ అంబానీ నవ్వేసింది.
Next Story