Mon Dec 23 2024 16:51:08 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : పాపం నీతూ అంబానీ... ఒక్కో సిక్సర్‌కు.. ఒక్కో ఎక్స్ప్రెషన్
నిన్న సన్ రైజర్స్ మ్యాచ్ చూస్తూ ముంబయి ఇండియన్స్ జట్టు యజమాని నీతూ అంబానీ ఒకింత ఆందోళనకు గురయ్యారు
నిన్న సన్ రైజర్స్ మ్యాచ్ చూస్తూ ముంబయి ఇండియన్స్ జట్టు యజమాని నీతూ అంబానీ ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఉప్పల్ స్టేడియంలో నిన్న ముంబయి ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు బ్యాటర్లు విరుచుకుపడ్డారు. సిక్సర్లు, ఫోర్లతో వారు బ్యాట్ తో బాదుతుండటంతో నీతూ అంబానీతో పాటు ఆమె కుమారుడు కూడా ఖిన్నులై చూస్తున్నారు. కెమెరాలు పలుమార్లు వారి వైపు తిరిగినప్పుడు ఇద్దరూ ఆందోళనగానే కనిపించారు.
ప్రతి సిక్సర్ కూ...
ఎందుకంటే సన్ రైజర్స్ జట్టు ఒక దశలో మూడు వందల పరుగులు చేస్తుందా? అని అనిపించింది. ముంబయి ఇండియన్స్ కు చెందిన ప్రతి బౌలర్ ను సన్ రైజర్స్ బ్యాటర్లు చితక బాదుతున్నారు. ఒక్కొక్క సిక్స్‌కు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నీతూ అంబానీ పెట్టడం కనిపించింది. ఒకరు కాదు... ఇద్దరు కాదు.. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రమ్ లు ఆడుతున్నంత సేపూ ఆందోళనతోనే కనిపించారు. ఇద్దరూ ఇలా ఉతికేస్తున్నారేమిటో అంటూ ఉసూరుగా కూర్చుండి పోయారు. మ్యాచ్ ను టీవీల్లో చూసేవారికి నీతూ అంబానీ కళ్లలో స్కోరు బోర్డు పరిగెత్తడం చూసి కన్నీళ్లు తిరగడం కూడా కనిపించాయి.
Next Story