Fri Dec 20 2024 07:51:27 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2-24 : పంజాబ్ కింగ్స్ తొలి విజయం
పంజాబ్ కింగ్స్ తొలి విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై పోరాడి నెగ్గింది
పంజాబ్ కింగ్స్ తొలి విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై పోరాడి నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కాపిటల్స్ 175 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని అధిగమించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆది నుంచి దూకుడుగానే ఆడింది. కరన్ హాఫ్ సెంచరీ చేశారు. లివింగ్స్టన్ సూపర్ బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
నాలుగు వికెట్ల తేడాతో...
నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ కాపిటల్స్ పై పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి ఓవర్ లో ఆరు బంతులకు ఆరు పరుగులు చేయాల్సి ఉండగా లివింగ్ స్టన్ ఉండటంతో పెద్దగా ఇబ్బంది పడకుండానే విజయాన్ని మూటగట్టుకుంది. క్యాచ్ లు జారవిడచటంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి దూరమయింది. చివరి ఓవర్ లో వైడ్ లు వేసి పంజాబ్ కింగ్స్ ను విజయాన్ని అందించారు. చివరిగా లివింగ్ స్టోన్ సిక్సర్ కొట్టడంతో పంజాబ్ కింగ్స్ గెలిచింది.
Next Story