Fri Dec 20 2024 06:42:01 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : క్యాచ్ వదిలేయకుంటే.. గెలుపు ఖచ్చితంగా గుజరాత్‌దే.. అదే మ్యాచ్ ను మార్చేసింది
గుజారాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ దే విజయం అయింది.
ఐపీఎల్ మ్యాచ్ లు అంతే. చివరి ఓవర్లలో టర్న్ తీసుకుంటాయి. ఏమాత్రం ఆటగాళ్లు అజాగ్రత్తగా ఉన్నా సరే. మ్యాచ్ చేజారి పోతుంది. నిన్న గుజారాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ దే విజయం అయింది. పెద్ద లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఇందులో ఒకే ఒక క్యాచ్ మ్యాచ్ దశను... దిశను మార్చేసింది. పంజాబ్ విజయానికి నాలుగు ఓవర్లలో 46 పరుగులు రావాల్సి ఉండగా అశుతోష్ క్యాచ్ ను ఉమేశ్ వదిలేశాడు. మోహిత్ శర్మ బౌలింగ్ లో ఇది జరిగింది. అలాగే మరో క్యాచ్ ను సుదర్శన్ మిస్ చేశాడు. అదే గుజరాత్ కొంప ముంచింది. దీంతో అశుతోష్ మూడు ఫోర్లు, సిక్సర్ ను బాది మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
గిల్ అద్భుతంగా ఆడి...
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ మంచి స్కోరు చేసింది. ప్రధానంగా టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 89 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సాహా 11 పరుగులకే అవుటయినప్పటికీ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ కూడా పరుగుల వరదను పారించాడు. 33 పరుగులు చేసినా సాయిసుదర్శన్ ఉన్నంత సేపు స్కోరు బోర్డు పరుగులు తీసింది. విలియమ్సన్ 26 పరుగులు చేశాడు. తర్వాత విజయ్ శంకర్ ఎనిమిది పరుగులకే అవుటాయినా తర్వాత వచ్చిన తెవాటియా ఫోర్లు, సిక్సర్లతో స్కోరును 199 పరుగులకు చేర్చాడు.
పెద్ద లక్ష్యమే అయినా...
అంటే పంజాబ్ కింగ్స్ లక్ష్యం 200 పరుగులు చేయాలి. ఇది పెద్ద లక్ష్యమే. ఆదిలోనే బెయిర్ ధావన్ ఒక పరుగుకే అవుట్ కావడంతో పంజాబ్ ఫ్యాన్స్ కొంత డీలా పడ్డారు. బెయిర్ స్టో 22 పరుగులు, ప్రభ్‌సిమ్రన్ 35 పరుగులు చేశారు. వారిద్దరూ అవుట్ అయిన తర్వాత వరసగా పెవిలియన్ బాటపట్టడంతో గుజరాత్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ శశాంక్ చెలరేగి ఆడాడు. 61 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. శశాంక్ కు తోడుగా అశుతోష్ నిలిచాడు. 31 పరుగులు చేసి జట్టును విజయ పధాన నడిపించాడు. ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్ ను మలుపు తిప్పేసింది. అందుకే అంటారు ఐపీఎల్ లో ఏమాత్రం తప్పు జరిగినా మూల్యం చెల్లించకతప్పదని.
Next Story