Mon Dec 23 2024 11:06:54 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ప్లే ఆఫ్ కు చేరేదెవరు? ఇంటి దారి పట్టేదెవరు?
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ జరగనుంది
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఆదివారం కావడంతో రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్న ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ లో రేసు కోసం జట్లన్నీ శ్రమిస్తున్నాయి. ఎంతగా అంటే కసితో మైదానంలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తాయి. లేకుంటే రేస్ నుంచి తప్పుకుంటాయి. ఈ నేపథ్యంలో నేడు జరుగుతున్న రెండు మ్యాచ్ లలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అన్ని జట్లు ఫామ్ లోకి వచ్చాయి. అత్యధిక స్కోర్లు నమోదు చేస్తున్నాయి. ప్రారంభంలో కొంత ఇబ్బంది పడినా సీజన్ ముగింపు దశకు జట్టు సమిష్టిగా రాణిస్తుండటంతో ఎవరిది గెలుపు అన్నది అంచనా వేయడం కష్టంగా మారింది.
నేడు తేల్చనున్న ఫలితం...
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కు కీలకం. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ కు చేరుకోవడానికి ఆశలుంటాయి. ఓటమి పాలయితే ఇక అంతే. రాజస్థాన్ రాయల్స్ కు ఆ ఇబ్బంది లేదు. గెలిచినా, ఓడినా ప్లే ఆఫ్ కు చేరుకున్నట్లే. ఇక మరో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఢిల్లీ కాపిటల్స్ జట్టు తలపడుతుంది. రెండు జట్లు మంచి ఊపు మీదున్నాయి. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లకు గెలుపు కీలకమే. ఢిల్లీ కాపిటల్స్, బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకోవాలంటే గెలవక తప్పని పరిస్థితి.
Next Story