Mon Dec 23 2024 04:08:06 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : సమ ఉజ్జీలు పోటీ పడితే అంతే... నువ్వు వంద కొడితే.. నేను కొట్టలేనా?
రాజస్థాన్ రాయల్స్ తో కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ దే విజయం అయింది.
అదే ఐపీఎల్ లో జరిగేది. సెంచరీ చేసి ఎక్కువ పరుగులు చేశామన్న ఆనందం ఆ జట్టులో పెద్దగా నిలవదు. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు కూడా అంతే బలమైనది. అందుకే గెలుపు అనేది చివరి వరకూ ఎవరిది అన్నది అంచనా వేయడం ఎవరికైనా కష్టమే. ఒక్కడు నిలదొక్కుకుంటే చాలు ఎంతటి భారీ స్కోరునయినా ఊదేస్తాడు. అందులో రెండు జట్లు ఫుల్లు ఫామ్ లో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి, రెండు స్థానాల కోసం రెండు జట్లు పోటీ పడుతున్నాయి. నా సామిరంగా ఈ జట్ల మధ్య మ్యాచ్ చూస్తే పోట్లగిత్తలు కొట్లాడుకున్నట్లు ఉండక మరెలా ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ తో కోల్కత్తా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్ నిన్న అదే జరిగింది.
రెండు శతకాలు...
నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్ తో కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ లో రెండు శతకాలు నమోదయ్యాయి. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉండగా, రెండో స్థానంలో కోల్కత్తా నైట్ రైడర్స్ ఉంది. మొదటి స్థానాన్ని పదిలం చేసుకోవాలని రాయల్స్, ఫస్ట్ ప్లేస్ దక్కించుకోవాలని రైడర్స్ రెండూ తమ ఆట రుచిని చూపించాయి. అయితే చివరకు రాజస్థాన్ రాయల్స్ తో కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ దే విజయం అయింది. మొదటి ప్లేస్ ను పదిలం చేసుకుంది. రెండు జట్లను అభినందించకుండా ఉండలేం. భారీ స్కోరు అని బ్యాట్ తడబడ లేదు. బంతి గతి తప్పలేదు. అంత సవ్యంగా జరిగి విక్టరీని రాయల్స్ తమ చేతికి చిక్కించుకుంది.
నరేన్... బట్లర్...
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత్తా నైట్ రైడర్స్ ఆరు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఐపీఎల్ లో ఇది భారీ స్కోరు. ఇందులో సునీల్ నరేన్ 109 పరుగులు చేశాడు. రఘువంశీ 30 పరుగులు చేశాడు. రింకూ సింగ్ ఇరవై పరుగులు చేశాడు. స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. ఆరు వికెట్లు పడ్డాయని రాజస్థాన్ రాయల్స్ సంతోషించలేదు. అలాగే 223 భారీ లక్ష్యమని కుంగిపోలేదు. తర్వాత బరిలోకి దిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. బట్లర్ 107 పరుగులు చేసి అవుట్ కాకుండా క్రీజునే అంటిపెట్టుకుని ఉన్నాడు. వచ్చిన వారు వచ్చినట్లు వెళుతున్నా తాను మాత్రం చెక్కు చెదరని విశ్వాసంతో బట్లర్ బాదిన బాదుడు మాత్రం చూసి తీరాల్సిందే. అలా రాజస్థాన్ రాయల్స్ లో బట్లర్, నైట్ రైడర్స్ లో నరేన్ లు వీరబాదుడు బాది ఫ్యాన్స్ ను అలరించారు. అబ్బురపర్చే షాట్లతో స్టేడియంలో మోత పుట్టించారు.
Next Story