Sun Dec 22 2024 06:47:13 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2-24 : కోహ్లి పోరాటం వృధా... సొంత మైదానంలోనే ఓటమి... కారణం ఎవరంటే?
బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలయింది
సాధారణంగా ఐపీఎల్ 2024 సీజన్ లో సొంత మైదానంలో ఆడిన జట్లన్నీ గెలుస్తూ వస్తున్నాయి.కానీ నిన్న బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. 20 ఓవర్లకు 182 పరుగులు చేసింది.ఇందులో కోహ్లి ఒక్కడే 83 పరుగులు చేశాడు. మిగిలిన ఛాలెంజర్స్ బ్యాటర్లు విఫలం కావడంతో జట్టు స్కోరు పరుగులు పెట్టలేకపోయింది. అదే ఆ జట్టు ఓటమికి కారణమయింది. చివరకు కోల్కత్తా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది.
ముందుగానే...
ఈ మ్యాచ్ ఫలితం ముందుగానే తెలిసిపోయింది. కోల్కత్తా నైట్ రైడర్స్ ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఆడి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ లక్ష్యాన్ని సులువుగానే ఛేదించారు. కోల్కత్తాలో ఓపెనర్లుగా దిగిన ఫిల్ 30 పరుగులు, నరైన్ 47 పరుగులు చేసి తొలి ఓవర్లలోనే స్కోరు బోర్డును పరుగులు తీయించారు. తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ అర్ధసెంచరీ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 39 పరుగులు చేశాడు. రింకూ సింగ్ వచ్చి మ్యాచ్ ను ముగించాడు.
విరాట్ ఒక్కడే...
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కొహ్లి ఒక్కడే మెరుపులు మెరిపించాడు. 83 పరుగులు చేసిన కోహ్లి నాటౌట్ గా నిలిచాడు. డుప్లెసిస్ ఎనిమిది పరుగులకే అవుటయ్యాడు. తర్వాత వచ్చిన గ్రీన్ కొంత దూకుడుగా ఆడి 33 పరుగులు చేశాడు. గ్రీన్ అవుట్ అయిన తర్వాత స్కోరు బోర్డు కొంత నెమ్మదించింది. మ్యాక్స్వెల్ 28 పరుగులు చేసి అవుట్ కావడంతో ఇక ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. దీంతో 182 పరుగులే 20 ఓవర్లలో చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడం కోల్కత్తాకు పెద్ద కష్టమేమీ కాలేదు.
Next Story